యూపీఎస్సీ అభ్యర్థులకు మరో గుడ్ న్యూస్
సివిల్ సర్వీసెస్ పరీక్ష దరఖాస్తుల గడువును యూపీఎస్సీ మరోసారి పొడిగించింది.
యూపీఎస్సీ అభ్యర్థులకు మరో గుడ్ న్యూస్. సివిల్ సర్వీసెస్ పరీక్ష దరఖాస్తుల గడువును యూపీఎస్సీ మరోసారి పొడిగించింది. అభ్యర్థులు ఫిబ్రవరి 21వరకు దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నాది. సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2025 పరీక్షకు గత నెలలో నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. జనవరి 22న మొదలైన దరఖాస్తుల ప్రక్రియ తొలుత ఫిబ్రవరి 11తో ముగియగా.. అధికారులు ఆ గడువును 18వ తేదీ వరకు పొడిగించారు.
ఆ గడువు సైతం నేటితో ముగియడంతో ఫిబ్రవరి 21వరకు మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 979 పోస్టుల భర్తీ కోసం సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2025 జనవరిలో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. యూపీఎస్సీ తాజా నిర్ణయంతో అభ్యర్థులు 22వ తేదీ సాయంత్రం 6 వరకు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా అప్లికేషన్స్ లో ఏవైనా పొరపాట్లు ఉంటే ఫిబ్రవరి 22 నుంచి 28వ తేదీ వరకు సవరించుకునేందుకు ఎడిట్ ఆప్షన్ కల్పించింది. ఇక 150 పోస్టులకు విడుదలైన ఐఏఎఫ్(IFS) దరఖాస్తుల గడువు కూడా ఫిబ్రవరి 21 వరకు పొడిగిస్తూ యూపీఎస్సీ నిర్ణయం తీసుకుంది.