ఆప్ 31.. బీజేపీ 39 చోట్ల ఆధిక్యం
ఆధిక్యాల్లో బీజేపీ-ఆప్ మధ్య హోరా హోరీ పోటీ. కాంగ్రెస్ 0
Advertisement
దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే ఫలితాల సరళి కనిపిస్తున్నప్పటికీ.. ఆధిక్యాల్లో బీజేపీ-ఆప్ మధ్య హోరా హోరీ పోటీ కనిపిస్తున్నది. ఇప్పటివరకు వెలువడుతున్న ఫలితాలను చూస్తుంటే.. ఆధిక్యాల్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ (36)ను దాటింది. ప్రస్తుతం బీజేపీ 39 స్థానాల్లో ముందంజలో ఉండగా.. ఆప్ 31 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నది. కాంగ్రెస్ మొదట ఒక చోట ముందంజలో ఉన్నట్లే కనిపించినా.. ఆ తర్వాత వెనుకంజలోకి పడిపోయింది. ఏ స్థానంలోనూ కాంగ్రెస్ ప్రభావం చూపలేకపోయింది.
ప్రముఖుల ఫలితాల సరళి ఎలా ఉందంటే
- న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ ముందంజలోకి వచ్చారు. తన బీజేపీ అభ్యర్థి పర్‌వేశ్ సాహిబ్ సింగ్ వర్మపై ఆధిక్యంలోకి వచ్చారు
- కాల్‌కాజీ స్థానంలో ఢిల్లీ సీఎం ఆతిశీ వెనుకంజ
- జంగ్‌పురలో మనీశ్ సిసోడియా ముందంజ
- షాకుర్ బస్తీలో ఆప్ అభ్యర్థి సత్యేంద్ర కుమార్ జైన్ ముందంజ
- ఓక్లా స్థానంలో ఆప్ అభ్యర్థి అమానుతల్లా ఖాన్ వెనుకంజ
Advertisement