గాజాలో కండోమ్స్‌ పంపిణీకి 50 మిలియన్‌ డాలర్లు

బైడెన్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని నిలిపివేసిన డొనాల్డ్‌ ట్రంప్‌

Advertisement
Update:2025-01-29 11:57 IST

అనవసర ఖర్చులు తగ్గిస్తానంటూ ముందు నుంచి వ్యాఖ్యలు చేస్తున్న అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దానికి తగ్గట్లుగానే చర్యలు తీసుకుంటున్నారు. జో బైడెన్‌ హయాంలో తీసుకున్న పలు నిర్ణయాలను నిలిపేస్తున్నారు. ఈ క్రమంలో దుబారా అరికడతామంటూ ఎలాన్‌ మస్క్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియెన్సీ తాజాగా ఓ విషయాన్ని గుర్తించింది. గాజాలో కండోమ్స్‌ పంపిణీకి బైడెన్‌ ప్రభుత్వం 50 మిలియన్‌ డాలర్లను కేటాయించినట్లు గుర్తించింది. ఈ విషయాన్ని వైట్‌హౌస్‌ మీడియా కార్యదర్శి కరోలిన్‌ లీవిట్‌ వెల్లడించారు. అయితే అందుకు తగిన ఆధారాలను మాత్రం వెల్లడించలేదు. కాగా ఈ విషయం తన దృష్టికి రాగానే గత ప్రభుత్వ నిర్ణయాన్ని నిలిపివేశామన్నారు. 

Tags:    
Advertisement

Similar News