మస్క్‌తో భేటీ కానున్న ప్రధాని మోడీ!

స్టార్‌లింక్‌ సేవలపై మస్క్‌తో ప్రధాని చర్చించే అవకాశం ఉన్నదంటూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు

Advertisement
Update:2025-02-13 08:56 IST

అమెరికా పర్యటనలో భాగంగా మోడీ ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది.. స్టార్‌లింక్‌ సేవలపై మస్క్‌తో ప్రధాని చర్చించే అవకాశం ఉన్నదంటూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. స్టార్‌లింక్‌ భారత మార్కెట్‌ లోకి అడుగుపెట్టాలని భావిస్తున్నది. స్పెక్ట్రంను వేలం వేయడం కాకుండా కేటాయిస్తే బాగుంటుందని మస్క్‌ ఆలోచన. భారత ప్రభుత్వం ఆ అంశాన్ని పరిశీలిస్తున్నది.

అంతకు ముందు అమెరికాకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీకి అక్కడి భారత సంతతి ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. చల్లని వాతావరణం ఉన్నప్పటికీ.. వాషింగ్టన్‌ డీసీలో ప్రవాస భారతీయులు నాకు ప్రత్యేక స్వాగతం పలికారు. వారికి నా కృతజ్ఞతలు అని మోడీ పోస్ట్‌ చేశారు.భారతదేశం-అమెరికా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యంలో కొత్త అధ్యాయనం మొదలైందని విదేశాంగశాఖ ఎక్స్‌లో పోస్టు చేసింది. ఈ పర్యటనలో భాగంగా ఆయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, కాంగ్రెస్‌ చట్టసభ సభ్యులతోపాటు పలువురు ప్రముఖులతో భేటీ కానున్నట్లు వెల్లడించింది. ఇదిలా ఉండగా.. యూఎస్‌ నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌ తులసీ గబ్బార్డ్‌తో భేటీ అయ్యారు. ఇరుదేశాల మధ్య ఉన్న స్నేహ సంబంధాలపై ఆమెతో చర్చలు జరిపినట్లు ఆయన ఎక్స్‌ వేదికగా తెలిపారు.

Tags:    
Advertisement

Similar News