ఆ భారతీయులను ఛార్టర్డ్‌ ఫ్లైట్స్‌ లో వెనక్కి పంపిన అమెరికా

అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వారిని ఇమిగ్రేషన్‌ చట్టాల ప్రకారం ఇండియాకు తరలిస్తున్నట్లు అమెరికా హోం ల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం ప్రకటన

Advertisement
Update:2024-10-26 13:58 IST

అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వారిని ఛార్టర్డ్‌ ఫ్లైట్స్‌లో తిరిగి భారత్‌కు పంపిస్తున్నట్లు అమెరికా హోం ల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం తెలిపింది. దీనికి భారత ప్రభుత్వం సహకరిస్తున్నట్లు తెలిపింది. అక్టోబర్‌ 22న ఒక ఛార్టర్డ్‌ విమానాన్ని భారత్‌కు పంపినట్లు చెప్పింది. చట్టవిరుద్ధంగా ఉంటున్న భారతీయులను వేగంగా తరలిస్తామని అమెరికా హోం ల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం ఉన్నతాధికారి క్రిస్టీ ఒక ప్రకటనలో తెలిపారు.

స్మగ్లర్ల మాయలో అక్రమ శరణార్థులు పడకూడదనేది తమ ఉద్దేశమని చెప్పారు. అక్రమంగా అమెరికాలో ప్రవేశించిన వారి పట్ల ఇమిగ్రేషన్‌ చట్టాల ప్రకారమే నడుచుకుంటామని వివరించారు. చట్టబద్ధమైన పద్ధతుల్లోనే విదేశీయులు అమెరికా వచ్చేలా తాము ప్రోత్సహిస్తామని అన్నారు. 2024 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ సహా 145 దేశాలకు చెందిన లక్షా 60 వేల మందిని 495 అంతర్జాతీయ విమానాల్లో వారి స్వదేశానికి పంపినట్లు అమెరికా హోం ల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం ప్రకటించింది. ఈ మేరకు ఆయా దేశాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు వివరించింది. 

Tags:    
Advertisement

Similar News