పెళ్లి వేడుకలో విషాదం..100 మందికిపైగా మృతి

అగ్ని ప్రమాదంపై ఇరాక్‌ ప్రధానమంత్రి మహ్మద్‌ అల్‌ సూదాని స్పందించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తున‌కు ఆదేశించారు. గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేశారు.

Advertisement
Update:2023-09-27 10:56 IST

ఇరాక్‌లో ఓ పెళ్లి వేడుక విషాదంతంగా మారింది. పెళ్లి మండపంలో మంటలు చెలరేగి దాదాపు 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర ఇరాక్‌లోని నినెవె ప్రావిన్స్‌లోని హమ్‌దానియా పట్టణంలో ఈ ఘటన జరిగింది. ఘటన జరిగిన ప్రాంతం రాజధాని బాగ్దాద్‌కు 335 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఘటనలో మరో 150 మందికి తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తోంది. గాయపడినవారిని చికిత్స కోసం సమీప ఆస్పత్రులకు తరలించారు.

అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయన్నారు అధికారులు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. హమ్దానియాలోని ప్రధాన హాస్పిటల్‌ ముందు వందలాది మంది రక్తదానం చేసేందుకు వేచి చూస్తున్నారు. బాణాసంచా కాల్చడం సహా నిబంధనలకు విరుద్ధంగా ఈవెంట్‌ హాల్‌లో అత్యంత మండే స్వభావం గల వస్తువులను ఎక్కువగా ఉంచడమే భారీ ప్రమాదానికి దారి తీసిందని అనుమానిస్తున్నారు. మంటల ధాటికి ఈవెంట్‌ హాల్ సీలింగ్‌ కూడా కూలిందన్నారు. చాలా నాసిరకం మెటీరియల్‌తో భవనం నిర్మించినట్లు గుర్తించారు.

అగ్ని ప్రమాదంపై ఇరాక్‌ ప్రధానమంత్రి మహ్మద్‌ అల్‌ సూదాని స్పందించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తున‌కు ఆదేశించారు. గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేశారు.

Tags:    
Advertisement

Similar News