నాపై గూఢచర్యానికి కేంద్రం పెగాసస్ వాడింది:కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో రాహుల్ గాంధీ

‘భారత ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోంది. మేం ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ప్రయత్నిస్తున్నాము’ అని రాహుల్ అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులపై గూఢచర్యం చేయడానికి పెగాసస్‌ను ఉపయోగించిందని రాహుల్ గాంధీ ఆరోపించారు.

Advertisement
Update:2023-03-03 12:18 IST

భారత దేశంలో అనేక మంది రాజకీయనాయకులు, జర్నలిస్టులు, కార్యకర్తల ఫోన్లలో పెగాసిస్ స్పై వేర్ ను జొప్పించి ప్రభుత్వం గూఢచర్యం చేసిందని , పెగాసస్‌ స్పైవేర్ ను ఉపయోగించి తనపై కూడా గూఢచర్యానికి పాల్పడిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. బ్రిటన్ పర్యటనలో ఉన్న రాహుల్ శుక్రవారం కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘భారత ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోంది. మేం ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ప్రయత్నిస్తున్నాము’ అని రాహుల్ అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులపై గూఢచర్యం చేయడానికి పెగాసస్‌ను ఉపయోగించిందని రాహుల్ గాంధీ ఆరోపించారు.

దేశంలో మీడియాను, న్యాయవ్యవస్థను కబ్జా చేసి, నియంత్రిస్తున్నారని ఆరోపించారు. తమకు నచ్చనివారిపై నిఘా, బెదిరింపులు... మైనారిటీలు, దళితులు, గిరిజనులపై దాడులతో ప్రభుత్వంపై అసమ్మతిని అణగదొక్కుతున్నారని విమర్శించారు.

ప్రస్తుతం భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని, ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ దాడికి గురవుతున్నాయని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు.

Tags:    
Advertisement

Similar News