హిండెన్ బర్గ్ పై ప్రతీకారం తీర్చుకోబోతున్న అదానీ!
గౌతమ్ అదానీ హిండెన్ బర్గ్ సంస్థను న్యాయపరంగా ఎదుర్కొనేందుకు అమెరిలోని అత్యంత ఖరీదైన న్యాయ సంస్థలలో ఒకటైన వాచ్ టెల్ సంస్థను నియమించుకుంది. ఇది తన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన పెట్టుబడిదారులకు భరోసా ఇవ్వడానికి కూడా ఉపయోగపడుతుందని అదానీ భావిస్తున్నారు.
అదానీ గ్రూపు స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ మోసానికి పాల్పడిందని ఆరోపించిన US షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ పై ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్దమవుతున్నాడు గౌతమ్ అదానీ. అమెరికాలోని అత్యంత ప్రముఖ న్యాయం సంస్థను తన తరపున పని చేయడానికి అదానీ నియమించుకున్నాడని 'ది ఫైనాన్షియల్ టైమ్స్' నివేదించింది.
హిండెన్ బర్గ్ నివేదిక తో అదానీ గ్రూపు అల్లకల్లోలమై దాని షేర్లు పాతాళానికి పడిపోయాయి. పది లక్షల కోట్లకు పైగా అదానీ ఆస్తులు ఆవిరై పోయాయి. ప్రపంచ కుబేరుల జాబితాలో మూడవ స్థానం ఉన్న అదానీ హిండెన్ బర్గ్ దెబ్బకు 21వ స్థానానికి పడిపోయాడు. అనేక అంతర్జాతీయ సంస్థలు అదానీ కంపనీలో పెట్టిన పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నాయి. అదానీ గ్రూపును నమ్ముకొని కోట్ల రూపాయలు షేర్లు కొన్న మదుపుదార్లు రోడ్డు మీదికి వచ్చేశారు.
ఇన్ని పరిణామాలకు కారణమైన హిండెన్ బర్గ్ సంస్థపై రగిలిపోతున్న గౌతమ్ అదానీ ఆ సంస్థను న్యాయపరంగా ఎదుర్కునేందుకు అమెరిలోని అత్యంత ఖరీదైన న్యాయ సంస్థలలో ఒకటైన వాచ్ టెల్ సంస్థను నియమించుకుంది. ఇది తన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన పెట్టుబడిదారులకు భరోసా ఇవ్వడానికి కూడా ఉపయోగపడుతుందని అదానీ భావిస్తున్నారు.
హిండెన్ బర్గ్ నివేదిక తర్వాత అదానీ మొదట ఒక పేజీ ప్రకటన, ఆతర్వాత హిండెన్ బర్గ్ సంస్థకు 413 పేజీల ఖండన లేఖ పంపిన తర్వాత కూడా మదుపు దార్లలో నమ్మకం మాత్రం కలిగించలేకపోయాడు అదానీ.దాంతో ఎంత ఖర్చయినా పర్వాలేదనే ధోరణితో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనపడుతోంది. ప్రపంచ ఆర్థిక సంస్థలు, పెట్టుబడిదారులకు తన కంపెనీ బలమైన స్థితిలోనే ఉందన్న నమ్మకాన్నిఈ నిర్ణయం ద్వారా కలగజేయడం కూడా అదానీ ఉద్దేశం.
ఫైనాన్షియల్ టైమ్స్ కథనం ప్రకారం.. హిండెన్ బర్గ్ రిపోర్టుల కారణంగా అదానీ గ్రూపునకు ఎదురైన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు వాచ్ టెల్, లిప్టెన్, రోసెన్, కాట్జ్ వంటి సంస్థల్లోని న్యాయవాదులను అదానీ తరపున పలువురు సంప్రదించినట్లు చెబుతున్నారు. వీరి మీటింగ్ కూడా అదానీ గ్రూపునకు బాగా కావాల్సిన, అదానీ వియ్యంకుడు సిరిల్ అమర్ చంద్ మంగళ్ దాస్ కార్యాలయంలో జరిగినట్లు చెబుతున్నారు. సిరిల్ ష్రాఫ్ కుమార్తెను అదానీ కుమారుడికి ఇచ్చి వివాహం చేశారు.