రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి

క్లిక్‌ కెమిస్ట్రీతోపాటు బయోఆర్థోగోనల్‌ కెమిస్ట్రీలను అభివృద్ధి చేసినందుకు గానూ శాస్త్రవేత్తలు కరోలిన్‌ ఆర్‌ బెర్టోజీ, మార్టెన్‌ మెల్డల్‌, కే బ్యారీ షార్ప్‌లెస్‌లను ఈ ఏడాది నోబెల్‌ పురస్కారానికి ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ తెలిపింది.

Advertisement
Update:2022-10-05 17:55 IST

రసాయన శాస్త్రం (కెమిస్ట్రీ)లో విశేష పరిశోధనలు చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ ఏడాది నోబెల్ బహుమతి లభించింది. ఈ మేరకు నోబెల్ ప్రైజ్ కమిటీ ఇవాళ్ల విజేతల పేర్లు ప్రకటించింది. క్లిక్‌ కెమిస్ట్రీతోపాటు బయోఆర్థోగోనల్‌ కెమిస్ట్రీలను అభివృద్ధి చేసినందుకు గానూ శాస్త్రవేత్తలు కరోలిన్‌ ఆర్‌ బెర్టోజీ, మార్టెన్‌ మెల్డల్‌, కే బ్యారీ షార్ప్‌లెస్‌లను ఈ ఏడాది నోబెల్‌ పురస్కారానికి ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ తెలిపింది.

పరమాణువు నిర్మాణంలో కొత్త విధానమైన ఆర్గానోక్యాటలసిస్‌ను అభివృద్ధి చేసినందుకు గతేడాది బెంజిమిన్ లిస్ట్, డేవిడ్ మెక్‌మిల్లన్‌లకు అవార్డు దక్కింది. రసాయన శాస్త్రం అంటే పర్యావరణ కాలుష్యానికి కారణం అనే భావన నుంచి.. పర్యావరణ హితంగా మార్చిన విధానం కావడంతో గతేడాది అవార్డు వారికి లభించింది. ఇక ఇప్పుడు క్లిక్ కెమిస్ట్రీ కూడా ఓ నూతన ఆవిష్కరణ. బయోకంపాటిబుల్ స్మాల్ మాలిక్యుల్‌కు సంబంధించిన పరిశోధనలు ఇందులో చేస్తారు. ఇది కూడా పర్యావరణానికి హాని కలిగించని రసాయనాలను రూపొందించేందుకు ఉపయోగపడేదే.

ఈ ఏడాది ఇప్పటికే వైద్య రంగంలో స్వాంటే పాబోకు, ఫిజిక్స్‌లో అలెన్ ఆస్పెక్ట్, జాన్ ఎఫ్ క్లాజర్, ఆంటోన్ జీలింగర్‌కు నోబెల్ బహుమతులు ప్రకటించారు. తాజాగా రసాయన శాస్త్రానికి సంబంధించిన విజేతలను ఎంపిక చేశారు. ఇంకా ఆర్థిక రంగం, సాహిత్యం, శాంతి బహుమతులను ప్రకటించాల్సి ఉంది. నోబెల్ బహుమతి విజేతలకు 9 లక్షల డాలర్లు (దాదాపు రూ.7.30 కోట్లు) నగదు ఇస్తారు. ఈ ఏడాది డిసెంబర్ 10 జరిగే ప్రత్యేక కార్యక్రమంలో విజేతలకు బహుమతులు అందిస్తారు. ఆఫ్ సైన్సెస్ వెల్లడించింది. ఈ సారి కెమెస్ట్రీలో నోబెల్ అందుకున్నవారిలో ఓ మహిళా శాస్త్రవేత్త కూడా ఉండటం విశేషం. గతేడాది కెమిస్ట్రీలో నోబెల్ బహుమతి ఇద్దరికి వరించింది. కానీ ఈ సారి ముగ్గురు ఎంపికయ్యారు.

Tags:    
Advertisement

Similar News