వివాదాస్పద వెబ్ సిరీస్ కు పార్ట్ -2

వెబ్ సిరీస్ లోని ప్రతి ఎపిసోడ్ లో అసభ్యకర దృశ్యాలు, మాటలు కచ్చితంగా ఉండేలా ప్లాన్ చేసుకొని తెరకెక్కించారన్న ఆరోపణలు వచ్చాయి. క్లీన్ ఫ్యామిలీ ఇమేజ్ ఉన్న వెంకటేష్ ఈ ఒక్క వెబ్ సిరీస్ తో ఆ వర్గానికి కాస్త దూరం అయ్యాడు.

Advertisement
Update:2023-10-16 18:29 IST

టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్, రానా టైటిల్ రోల్ పోషించిన వెబ్ సిరీస్ `రానా నాయుడు`. ఈ వెబ్ సిరీస్ ను నెట్ ఫ్లిక్స్ నిర్మించగా.. కరణ్ అన్షుమన్, సుపర్న్ వర్మ దర్శకత్వం వహించారు. ఈ ఏడాది ఆరంభంలో ఇది ఆన్‌లైన్ వేదికగా విడుదలై తీవ్ర విమర్శల పాలైంది. ఈ వెబ్ సిరీస్ లో శ్రుతిమించిన అడల్ట్ కంటెంట్ ఉందని విమర్శలు వచ్చాయి.

వెంకటేష్ కు ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు ఉంది. వెంకటేష్ మొదటిసారిగా ఒక వెబ్ సిరీస్ లో నటించడంతో చాలామంది ఇంటిల్లిపాది ఈ సిరీస్ ను చూసేందుకు ఆసక్తి చూపించారు. మొదటి ఎపిసోడ్ తొలి పది నిమిషాలు చూడగానే అందులోని అడల్ట్ కంటెంట్ ను చూసి బిత్తరపోయారు. వెంటనే టీవీలను కట్టేశారు.

ఈ వెబ్ సిరీస్ లోని ప్రతి ఎపిసోడ్ లో అసభ్యకర దృశ్యాలు, మాటలు కచ్చితంగా ఉండేలా ప్లాన్ చేసుకొని తెరకెక్కించారన్న ఆరోపణలు వచ్చాయి. క్లీన్ ఫ్యామిలీ ఇమేజ్ ఉన్న వెంకటేష్ ఈ ఒక్క వెబ్ సిరీస్ తో ఆ వర్గానికి కాస్త దూరం అయ్యాడు. దీంతో అంతకు ముందు ప్రకటించిన విధంగా రానా నాయుడుకు పార్ట్ -2 ఉండదని అందరూ భావించారు.

అయితే రానా నాయుడు వెబ్ సిరీస్ కు పార్ట్ -2 ఉంటుందని తాజాగా వెంకటేశ్ ప్రకటించారు. ప్రస్తుతం వెంకటేశ్ సైంధవ్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఫంక్ష‌న్‌లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు. రానా నాయుడు హిందీ వెర్షన్ తో పోలిస్తే తెలుగులో అడల్ట్ కంటెంట్ తగ్గించినట్లు తెలిపాడు. అయినప్పటికీ విమర్శలు రావడంతో పార్ట్ -2లో అడల్ట్ కంటెంట్ చాలా వరకు తగ్గించినట్లు వెల్లడించాడు. ఇక వెంకటేష్ నటించిన సైంధవ్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది.

Tags:    
Advertisement

Similar News