పెరుగుతున్న సీజనల్ వ్యాధులు.. ఈ జాగ్రత్తలు మస్ట్!

గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది సీజనల్ వ్యాధులు 20 శాతం పెరిగినట్లు ఆరోగ్య శాఖ నివేదికలు చెప్తున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది ఫ్లూ జ్వరాలు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు గణనీయంగా పెరిగినట్టు అధికారులు గుర్తించారు.

Advertisement
Update:2023-10-21 09:00 IST

గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది సీజనల్ వ్యాధులు 20 శాతం పెరిగినట్లు ఆరోగ్య శాఖ నివేదికలు చెప్తున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది ఫ్లూ జ్వరాలు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు గణనీయంగా పెరిగినట్టు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా పట్టణాలలో ఈ సమస్య ఎక్కువగా ఉందని చెప్తున్నారు. ఈ క్రమంలో ప్రతిఒక్కరూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..

సీజనల్ వ్యాధులు పెరగడానికి వాయు కాలుష్యం ప్రధానమైన కారణమని అధికారులు చెప్తున్నారు. కాబట్టి ప్రతిఒక్కరూ కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా సిటీల్లో ఉండేవాళ్లు సొంత వాహనాలకు బదలు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ప్రయాణించడం, ఇంటి పరిసరాల్లో మొక్కలు పెంచడం, ఎలక్ట్రిక్ వాహనాలకు మారడం వంటి చర్యలతో కొంతవరకూ కాలుష్య ప్రభావాన్ని తగ్గించొచ్చు.

ఇక ఆరోగ్యం విషయానికొస్తే ఇమ్యూనిటీ తక్కువగా ఉండడం వల్లనే ఇన్ఫెక్షన్ల కేసులుపెరుగుతున్నాయని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి సీజనల్‌గా వచ్చే ఫ్లూ జ్వరాలు, ఇన్ఫెక్షన్లను ఎదుర్కొనేందుకు శరీరాన్ని సిద్ధం చేయాలి. దానికోసం రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు తీసుకుంటుండాలి. జంక్ ఫుడ్ మానేయాలి.

ఇమ్యూనిటీ పెరిగేందుకు బ్యాలెన్స్‌డ్ డైట్ తీసుకోవాలి. ఆహారంలో సీజనల్ పండ్లు, కూరగాయలతో పాటు ప్రొటీన్స్ కోసం పప్పు ధ్యాన్యాలు, ఫైబర్ కోసం మిల్లెట్స్, బ్రౌన్ రైస్, గోధుమల వంటవి తీసుకుంటుండాలి. అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన విధంగా కనీసం వారానికి150 నిమిషాల వ్యాయామం ఉండేలా చూసుకోవాలి. అంటే రోజుకి 20 నిముషాల పాటైనా తేలికపాటి వ్యాయామం చేస్తుండాలి. ఇకపోతే తగినంత నిద్ర లేకపోవడం వల్ల కూడా రోగనిరోధక వ్యవస్ధ క్షీణిస్తుంది. కాబట్టి రోజుకి ఆరు నుంచి ఎనిమిది గంటల నిద్రపోయేలా చూసుకోవాలి.

వీటితోపాటు పిల్లలకు ప్రతి ఏడాది వేయించాల్సిన టీకాలు క్రమం తప్పకుండా వేయిస్తుండాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. శ్వాసకోస ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండేందుకు ముఖాన్ని చేతులతో తాకే అలవాటు మానుకోవాలి. బయటకు వెళ్లేటప్పుడు హెల్మెట్ లేదా మాస్క్ వంటివి ధరిస్తుండాలి.

జ్వరం వచ్చినప్పుడు వెంటనే రక్తపరిక్ష చేయించుకుని అది ఏ రకమైన జ్వరమో నిర్ధారించుకోవాలి. ఇష్టానుసారంగా సొంత వైద్యానికి పోవద్దు. అలాగే ఒంట్లో బాగోనప్పుడు బయటకు వెళ్లకుండా ఇంటిపట్టునే ఉంటూ తగినంత విశ్రాంతి తీసుకోవాలి.

Tags:    
Advertisement

Similar News