ప్రతి రోజు ఒక లవంగం తినండి..బోలెడు ఉపయోగాలు ఏంటంటే!

ప్రతి రోజు ఒక లవంగం నమలడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. లవంగాల వాడకం వల్ల ఆహారం రుచి పెరుగుతుంది. ఇది కాకుండా, లవంగం మన శరీరంపై అనేక ప్రభావాలను చూపుతుంది.

Advertisement
Update:2024-10-10 17:38 IST

ప్రతి రోజు ఒక లవంగం నమలడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. లవంగాల వాడకం వల్ల ఆహారం రుచి పెరుగుతుంది. ఇది కాకుండా, లవంగం మన శరీరంపై అనేక ప్రభావాలను చూపుతుంది. లవంగం మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడే ఆయుర్వేద వైద్యంలో ఇమ్యూనిటీ పవర్ని పెంచే సాధనంగా ఉపయోగిస్తారు. డయాబెటిస్‌తో బాధపడేవారు ప్రతి రోజు లవంగాన్ని తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. యాంటీ సెప్టిక్ గుణాలు చిగుళ్లు సమస్య, దంతాల సమస్య, పిప్పి పన్ను సమస్యను లవంగం నివారిస్తుంది. మనకు నోటి దుర్వాసన వచ్చినప్పుడల్లా, కిచెన్‌లో ఉంచిన రెండు లవంగాలను నోటిలో వేసుకుంటే, ఒక్కసారిగా నోటి దుర్వాసన మటుమాయం అవుతుంది. చాలా వరకు భారతీయ ఇళ్లలో లవంగాలను మసాలాగా ఉపయోగిస్తారు. లవంగాలలో విటమిన్లు, ఫాస్పరస్, ఫైబర్, ప్రోటీన్, ఐరన్, కాల్షియం, పొటాషియం, మాంగనీస్, కార్బోహైడ్రేట్లు, యాంటీఆక్సిడెంట్లు వంటి అనేక ఇతర పోషకాలు ఉన్నాయి. ఇవి శరీరంపై సానుకూల ప్రభావాలను చూపుతాయి.

కొంత మొత్తంలో వాడితే, అది ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.ఇందులో విటమిన్ కె, పొటాషియంలు ఉంటాయి. ఇందులో యూజినాల్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది ఘాటుగా ఉంటుంది. లవంగాల్లో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. బీటా కెరోటిన్ శరీరంలో విటమిన్ ఎగా మారుతుంది. ఇది కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. చర్మం, జుట్టు రెండింటికీ మంచిది. రోజూ లవంగాలు తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఎక్కువ తీసుకోవడానికి వీలు లేదు. రోజుకు ఒకటి నుంచి రెండు లవంగాలు వంటి చిన్న పరిమాణంలో మాత్రమే తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణలు సూచిస్తున్నారు. రుచి, ఆరోగ్య ప్రయోజనాల కోసం లవంగాలను టీ రూపంలో లేదా భోజనంలో చేర్చడం ద్వారా వాటిని తీసుకోవచ్చంటున్నారు.

Tags:    
Advertisement

Similar News