నాపై కేసు కొట్టేయండి
హైకోర్టులో మాజీ మంత్రి హరీశ్‌రావు క్వాష్ పిటిషన్
Advertisement
తనపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో దాఖలైన కేసు కొట్టేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. బుధవారం హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. సిద్దిపేటకు చెందిన కాంగ్రెస్ నాయకుడు చక్రధర్ గౌడ్ ఫిర్యాదు మేరకు డిసెంబర్ ఒకటో తేదీన తనపై పంజాగుట్ట పోలీసులు ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టారని తెలిపారు. తనతో పాటు మాజీ డీసీపీ రాధాకిషన్ రావుపైనా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని పిటిషన్ లో పేర్కొన్నారు. నిరాధర ఆరోపణలు చేసి రాజకీయ కక్షతో కేసులు పెట్టారని తెలిపారు. ఈ కేసును కొట్టేయడంతో పాటు అరెస్టు చేయకుండా పోలీసులకు ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు.
Advertisement