Chaitanya Krishna | మరో నందమూరి హీరో క్లిక్ అవుతాడా?

Nandamuri Chaitanya Krishna - నందమూరి కుటుంబం నుంచి మరో నటవారసుడు వస్తున్నాడు. చైతన్యకృష్ణ హీరోగా బ్రీత్ అనే సినిమా తెరకెక్కింది.

Advertisement
Update:2023-11-15 21:39 IST

విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు పెద్ద కుమారుడైన నందమూరి జయకృష్ణ... బసవతారక రామ క్రియేషన్స్‌ పేరుతో నిర్మాణ సంస్థని ఏర్పాటు చేసి, తొలి చిత్రంగా తన తనయుడు చైతన్యకృష్ణని హీరోగా పరిచయం చేస్తూ నిర్మిస్తున్న సీట్ ఎడ్జ్ ఎమోషనల్ థ్రిల్లర్ 'బ్రీత్'. వైద్యో నారాయణో హరి అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రానికి వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన 'బ్రీత్' టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా మేకర్స్'బ్రీత్' ట్రైలర్ ని విడుదల చేశారు. ట్రైలర్.. షాక్, ఎక్సయిటింగ్ ఎలిమెంట్స్ తో సీట్ ఎడ్జ్ ఎమోషనల్ థ్రిల్లర్ గా అలరించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి అనారోగ్యంతో హోప్సిటల్ లో చేరుతారు. ఆ తర్వాత హాస్పిటల్ లో చోటు చేసుకున్న సంఘటనలు చాలా గ్రిప్పింగ్ గా థ్రిల్లింగ్ గా ఉన్నాయి. 'ఇప్పటివరకూ ప్రపంచం చూడని ఓ కొత్త క్రైమ్ జరుగుతుంది''అనే డైలాగ్ మరింత ఆసక్తిని పెంచింది.

ట్రైలర్ లో చైతన్యకృష్ణ లుక్స్, యాక్టింగ్ బాగున్నాయి. తన పాత్రలో డిఫరెంట్ షేడ్స్ కనిపిస్తున్నాయి. వైదిక సెంజలియా, వెన్నెల కిషోర్ భద్రమ్ ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ళ, సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ గా బ్రీత్ ని మలిచాడని ట్రైలర్ చూస్తుంటే అర్ధమౌతుంది. మార్క్ కె రాబిన్ అందించిన నేపధ్య సంగీతం చాలా ఎక్సయిటింగ్ గా ఉంది.

నందమూరి వంశం నుంచి చాలామంది హీరోలొచ్చారు. కానీ ఎవ్వరూ పెద్దగా క్లిక్ అవ్వలేకపోయారు. ఇప్పటికీ బాలకృష్ణ, ఎన్టీఆర్ మాత్రమే కనిపిస్తున్నారు. నారా రోహిత్ దాదాపు ఫేడవుట్ అయిపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చిన చైతన్యకృష్ణ, ఏ మేరకు ప్రభావం చూపిస్తాడో చూడాలి.

Full View

Tags:    
Advertisement

Similar News