అప్పుడు మీసాల అన్నమయ్య, రామదాసు.. ఇప్పుడు మీసాల రాముడు

ఒక్క తెలుగులోనే కోటీపది లక్షలమంది చూసిన ఈ విషయమ్మీద చర్చ లేదెందుకు చెప్మా?!

Advertisement
Update:2023-06-06 10:26 IST

అప్పుడు మీసాల రామదాసు.. ఇప్పుడు మీసాల రాముడు

ఆయన ఆజానుబాహు,అరవింద దళాయతాక్షుడు,నీల మేఘశ్యాముడు....మనందరికీ తెలిసిన రాముడి వర్ణన.ఇదంతా కావ్యాల్లో...కానీ మన మనసుల్లో ఉండేది మాత్రం చిత్రకారుల,శిల్పుల ఊహ.

జటావల్కలాలతో రామలక్ష్మణులు అరణ్యవాసం చేసారు.మర్రిపాలతో జటలు వచ్చాయి,నార బట్టలు ధరించారు.

సంశయాత్ముల ప్రశ్న...మరి గడ్డాలు,మీసాలసంగతేందని?అదో పెద్ద చర్చ.వారు ధనుర్బాణాలతో పాటూ కత్తులూ,కటార్లు తీసుకుపోయే ఉంటారు.ఎందుకంటే రాముడి పక్కనున్న ఖడ్గాన్ని తీసుకుని లక్ష్మణుడు శూర్పణఖను విరూపిగా మార్చాడు కాబట్టి.

సరే,మరి క్షురకర్మలకూ చిన్నపాటి కత్తులు వాడారా?వాదర పదునుకోసం రాళ్లనే వాడారా?ఆ వివరాలు కనిపించవు.

ఈ విషయాలు ఇప్పుడెందుకా అంటే ఇన్నాళ్లకు "మీసాల రాముడు" కనిపించాడు.అదేనండోయ్ "ఆదిపురుష్" సినిమాలో.

ఈ సినిమా మొదటి టీజర్ విడుదల అవగానే జనం...మరీ ముఖ్యంగా హిందుత్వ వీరవాదులు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు.

ఆ తర్వాత ట్రైలర్స్,పాటలు చూసి శాంతించి సినిమా బజ్ పెంచేసారు.

"నువ్వు రాజకుమారి జానకి,వినువ్వుండాల్సింది రాజమందిరంలో" అంటున్న రాముడితో "నా రాఘవ ఎక్కడుంటే అదే నా రాజమందిరం" అంటున్న జానకిని చూసాము.

ఎవరో పెద్దాయన దీన్ని కాలమహిమ అన్నాడు.ఆయన ఏమంటాడంటే "మా కాలంలో భార్యాభర్తల దిక్కుమాలిన పిలుపులుండేవి..ఇదుగో,ఏమే.ఏవండీ వగైరాలు.అదే పౌరాణిక పాత్రలు స్వామీ,నాధా అంటూ పిలుచుకునేవారు.దూరదర్శన్ సీరియల్స్ వచ్చాక ఆర్యపుత్రా అని పిలుచుకుంటారని తెలిసింది.ఇప్పుడేమో ఎంచక్కా భర్తలను పేరుతో పిలుస్తున్నట్టే రాఘవా,రాం అనేస్తున్నారు".

సరేగానీ పెద్దాయనా...ఆ పిలుపుల దగ్గరే ఆగిపోయావ్ కానీ మరో విచిత్రం గమనించలేదా??

చూడామణి,శిరోమణి అని చదువుకున్నాము.తలలో పెట్టుకునే ఆభరణం.దీన్నే అన్నమయ్య "శిరసు మాణిక్యం" అంటూ

"ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపే నీకు" అనే కీర్తన రాసాడు.సీతమ్మవారు రాములవారికి హనుమంతుడితో పంపిన ఆనవాలు అది.మరి ఈ సినిమాలో చేతికున్న బంగారు గాజు తీసి హనుమంతుడికి ఇస్తున్నట్టు చూపిస్తున్నారే!!!!

ఒక్క తెలుగులోనే కోటీపది లక్షలమంది చూసిన ఈ విషయమ్మీద చర్చ లేదెందుకు చెప్మా?!?!!!?

Tags:    
Advertisement

Similar News