Vijayashanti | చాన్నాళ్ల తర్వాత ఖాకీలో విజయశాంతి

Vijayashanti's First Look - కల్యాణ్ రామ్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు విజయశాంతి. ఈరోజు ఆమె ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

Advertisement
Update: 2024-06-24 17:16 GMT

తన కెరీర్ లో పోషించిన ఇంటెన్స్ క్యారెక్టర్స్ తో లేడీ సూపర్ స్టార్ గా పేరుపొందారు విజయశాంతి. చాలా కాలం తర్వాత ఆమె నందమూరి కళ్యాణ్ రామ్ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో కర్తవ్యం తరహాలో నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు విజయశాంతి.

విజయశాంతికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా ఆమె పాత్రను వైజయంతి ఐపీఎస్ గా పరిచయం చేశారు. ఆమె షేడ్స్‌తో ఖాకీ దుస్తుల్లో డాషింగ్ గా కనిపించారు. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే ఆ పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉండబోతుందో అర్థమవుతోంది.

మేకర్స్ క్యారెక్టర్ ని పరిచయం చేయడానికి ఒక గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. “వైజయంతి ఐపీఎస్... తను పట్టుకుంటే పోలీస్ తుపాకికే ధైర్యం వస్తుంది... వేసుకుంటే యూనిఫాం కే పౌరుషం వస్తుంది... తానే ఒక యుద్ధం... నేనే తన సైన్యం...” అంటూ కళ్యాణ్ రామ్ వాయిస్‌ ఓవర్ తో క్యారెక్టర్ ని ప్రజెంట్ చేయడంతో అదిరిపోయింది. కళ్యాణ్ రామ్ కూడా వీడియోలో కనిపించాడు.

ప్రదీప్ చిలుకూరి రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. అజనీష్ లోకనాధ్ సంగీతం అందిస్తున్నాడు.

Tags:    
Advertisement

Similar News