Vijay Deverakonda: అవయవదానానికి ముందుకొచ్చిన విజయ్ దేవరకొండ

Vijay Devarakonda About Organ Donation: అవయవ దానం చేయడం మంచిది అంటున్నాడు హీరో విజయ్ దేవరకొండ. ఈ దిశగా అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చాడు.

Advertisement
Update:2022-11-16 18:37 IST

Vijay Deverakonda in a crazy Hindi remake!

 విజయ్ దేవరకొండ అవయవదానానికి ముందుకొచ్చాడు. తన మరణానంతరం తన అవయవాల్ని దానం చేస్తున్నట్టు ప్రకటించాడు విజయ్.ఈ మేరకు డిక్లరేషన్ పై సంతకం చేశాడు. అంతా అవయవదానానికి ముందుకు రావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చాడు.


హైదరాబాద్ లో జరిగిన ఓ ప్రైవేట్ ఈవెంట్ లో పాల్గొన్నాడు విజయ్ దేవరకొండ. ఈ సందర్భంగా అవయవ దానంపై ప్రకటన చేశాడు. దక్షిణాసియాలో అవయవదానానికి ముందుకొచ్చేవాళ్లు చాలా తక్కువగా ఉన్నారని, దీనిపై మరింత అవగాహన అవసరమని అభిప్రాయపడ్డాడు దేవరకొండ. 


తన తదనంతరం తన అవయవాలు మరో వ్యక్తికి ప్రాణం పోస్తే తనకు అంతకంటే ఆనందం ఇంకోటి ఉండదని ప్రకటించాడు విజయ్ దేవరకొండ. ఈ దిశగా మరింతమంది ముందుకురావాలని, తనతో చేతులు కలపాలని పిలుపునిచ్చాడు. 


సినిమాల విషయానికొస్తే, శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి అనే సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి కొత్త షెడ్యూల్ త్వరలోనే మొదలుకాబోతోంది. తాజాగా లైగర్ తో ఫ్లాప్ అందుకున్న విజయ్ దేవరకొండ, ఇప్పుడు తన ఆశలన్నీ ఖుషిపైనే పెట్టుకున్నాడు.

Tags:    
Advertisement

Similar News