Vijay Deverakonda | గౌతమ్ తిన్ననూరి సినిమా మళ్లీ ఆలస్యం
Vijay Deverakonda - గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేయాల్సిన సినిమా మరింత ఆలస్యం కాబోతోంది. విజయ్ ఇంకో సినిమాకు కాల్షీట్లు కేటాయించాడు.
ఖుషి సినిమా సెట్స్ పై ఉంటుండగానే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమాకు ఓకే చెప్పాడు విజయ్ దేవరకొండ. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా లాంఛింగ్ కూడా జరిగింది. హీరోయిన్ శ్రీలీల కూడా ఓపెనింగ్ కు వచ్చింది.
ఖుషి సినిమా పూర్తయిన వెంటనే ఈ సినిమానే సెట్స్ పైకి వస్తుందని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. ఆఖరి నిమిషంలో పరశురామ్ సినిమా తెరపైకొచ్చింది.
గీతగోవిందం సినిమా తర్వాత మరోసారి పరశురామ్, విజయ్ దేవరకొండ కలిశారు. దిల్ రాజు నిర్మాతగా సినిమా ఎనౌన్స్ చేశారు. ఈ సినిమా కూడా తాజాగా లాంఛ్ అయింది.
ఖుషి సినిమాను పూర్తిచేసిన విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి సినిమాను పక్కనపెట్టాడు. నేరుగా పరశురామ్ సినిమా సెట్స్ లో జాయిన్ అయ్యాడు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది.
దీంతో గౌతమ్ తిన్ననూరికి మరోసారి గ్యాప్ తప్పలేదు. హిందీ జెర్సీ సినిమా పూర్తిచేసిన తర్వాత, హీరో రామ్ చరణ్ తో చర్చలు సాగించాడు తిన్ననూరి. ఇతడి దర్శకత్వంలో నటించేందుకు దాదాపు ఓకే చెప్పాడు చరణ్. కానీ ఆఖరి నిమిషంలో కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు ఆగిపోయింది.
అలా కెరీర్ లో గ్యాప్ ఎదుర్కొన్న గౌతమ్, ఎట్టకేలకు తన కథతో విజయ్ దేవరకొండను ఒప్పించాడు. కానీ సెట్స్ పైకి వెళ్లేముందు ఈ సినిమా మరింత ఆలస్యమైంది. పరశురామ్ సినిమా షెడ్యూల్ పూర్తయిన తర్వాత, గౌతమ్ తిన్ననూరి మూవీపై క్లారిటీ వస్తుంది.