Nani31 | డిఫరెంట్ కాన్సెప్ట్ తో నాని సినిమా

Nani and Vivek Atreya - నాని-వివేక్ ఆత్రేయ సినిమాకు టైటిల్ లాక్ చేశారు. సరిపోదా శనివారం అనే డిఫరెంట్ టైటిల్ పెట్టారు.

Advertisement
Update:2023-10-23 20:39 IST

Saripodhaa Sanivaaram | అప్పుడే మరో సినిమా స్టార్ట్ చేసిన నాని

'అంటే సుందరానికీ' లాంటి కల్ట్ ఎంటర్‌టైనర్‌ని అందించిన నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ మరోసారి కలిశారు. తమ గత చిత్రం ఆస్కార్‌ మూవీ 'ఆర్‌ఆర్‌ఆర్‌'ను అందించిన డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. నిన్న సినిమాను అధికారికంగా ప్రకటించిన మేకర్స్, ఈరోజు సినిమా టైటిల్ ను ఎనౌన్స్ చేశారు.

ఈ సినిమాకు 'సరిపోదా శనివారం' అనే డిఫరెంట్ టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సందర్భంగా ఓ స్పెషల్ వీడియోను కూడా విడుదల చేశారు మేకర్స్. ప్రతి ఒక్కరికి ఓ రోజు వస్తుందని, ఇందులో హీరోకు ప్రతి వారం ఓ రోజు వస్తుందంటూ ప్రకటించారు. ఆరోజు శనివారం అని తెలిపారు. అంటే.. సినిమాలో హీరోకు, శనివారానికి ఏదో సంబంధం ఉంది. వీడియో చూస్తుంటే, సినిమాలో హీరోకు అతీత శక్తులు ఉన్నట్టు కనిపిస్తోంది.

ఓవరాల్ గా నాని-ఆత్రేయ కలిసి ఈసారి డిఫరెంట్ జానర్ ట్రై చేస్తున్నట్టు వీడియో చూస్తే స్పష్టంగా అర్థమౌతోంది. ఈ ఒక్క వీడియోతో సినిమాపై క్యూరియాసిటీ అమాంతం పెరిగింది. అటు నానికి, ఇటు దర్శకుడు వివేక్ ఆత్రేయ ఇద్దరికీ ఈ జానర్ పూర్తిగా కొత్త.

ప్రియాంక మోహన్ ను చిత్రంలో హీరోయిన్ గా అనౌన్స్ చేశారు. తాజాగా, తమిళ స్టార్ యాక్టర్ ఎస్ జె సూర్యను ఈ చిత్రంలో కీలక పాత్ర కోసం తీసుకున్నారు. ఈ సినిమాలో ఎస్ జే సూర్య విలన్ గా కనిపించే అవకాశం ఉంది. జేక్స్ బిజాయ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. హాయ్ నాన్న తర్వాత నాని నుంచి రాబోయే సినిమా ఇదే. దసరా, హాయ్ నాన్న సినిమాల తరహాలోనే 'సరిపోదా శనివారం' సినిమాను కూడా పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయబోతున్నారు. 

Full View

Tags:    
Advertisement

Similar News