Harom Hara | డివోషనల్ టచ్ కూడా..!
Harom Hara - సుధీర్ బాబు హీరోగా నటించిన సినిమా హరోంహర. ఈ సినిమాలో డివోషనల్ టచ్ కూడా ఉందంటున్నాడు సుధీర్ బాబు.
హీరో సుధీర్ బాబు మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'హరోం హర'. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు నిర్మించిన ఈ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌కి సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించాడు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ ఓ మోస్తరుగా హిట్టవ్వగా.. టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
రేపు హరోం హర గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో హీరో సుధీర్ బాబు విలేకరుల సమావేశంలో పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నాడు. మరీ ముఖ్యంగా సినిమాలో డివోషనల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయని అంటున్నాడు.
"ఇందులో ఒక డివోషనల్ ఎలిమెంట్ కూడా ఉంది. ఒక ఊరులో ఓ సమస్య ఉంటుంది. ఆ సమస్యని ఓ వ్యక్తి తీరుస్తాడు. ఆయన అక్కడి ప్రజలకు దేవుడిలా అనిపిస్తాడు. ఆ ఉర్లో అందరూ సుబ్రహ్మణ్య స్వామి భక్తులు. అలాగే ఇందులో ఓ నెమలి ఎలిమెంట్ కూడా ఉంటుంది. అయితే ఇవన్నీ కథలో భాగంగా అనుకోకుండా వస్తాయి. షూటింగ్ కోసం కుప్పంతో పాటు అలా కనిపించే లోకేషన్స్ కి వెళ్లాం. మంగులూర్, ఉడిపి, రాజమండ్రిలో షూట్ చేశాం."
ఇలా హరోంహర సినిమాలో డివోషనల్ ఎలిమెంట్స్ కూడా ఉన్న విషయాన్ని బయటపెట్టాడు సుధీర్ బాబు. జేమ్స్ బాండ్ లాంటి క్యారెక్టర్ చాలా హెవీ వెపన్స్, గాడ్జెట్స్ తయారు చేస్తుంటారని.. అలాంటి క్యారెక్టర్ మన ఊరిలో, మన పక్కింట్లోనే ఉంటే ఎలా ఉంటుంది.. పక్కింటి కుర్రాడు గన్స్ తయారు చేస్తే ఎలా ఉంటుంది లాంటి ఆలోచనలతో ఈ సినిమా తెరకెక్కిందని అన్నాడు.