Sreeleela | నన్ను నేను నిరూపించుకునే సినిమా
Sreeleela - భగవంత్ కేసరి సినిమాను ఛాలెంజింగ్ గా తీసుకున్నానని చెబుతోంది హీరోయిన్ శ్రీలల. ఇంతకీ ఈ సినిమాలో అంత ఛాలెంజింగ్ అంశాలు ఏమున్నాయి?
వరుసపెట్టి సినిమాలు చేస్తోంది శ్రీలీల. అన్నీ గ్లామర్ పాత్రలే, డాన్స్ ఇరగదీసిన సినిమాలే. అయితే వీటిలో డిఫరెంట్ గా కనిపిస్తున్న సినిమా ఒకే ఒక్కటి. అదే భగవంత్ కేసరి. బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ రోల్ చేశానని, నటించడానికి స్కోప్ ఉండే పాత్ర పోషించానని చెబుతోంది శ్రీలీల.
"భగవంత్ కేసరి కథ నాకు చాలా నచ్చింది. గ్లామర్ రోల్స్ చేయడానికి చాలా సినిమాలు ఉంటాయి. ఒక ఎమోషనల్ డ్రైవ్, నటనకు ఆస్కారం ఉండే సినిమా ఇది. నటనని నిరూపించుకునే సినిమాలా అనిపించింది. ఇప్పుడు కాకపొతే మరో కొంతకాలం తర్వాత ఇలాంటి పాత్ర చేయలేను. ఈ పాత్ర చేయడానికి ఇదే సరైన సమయం. శ్రీలీల అనగానే ప్రేక్షకుల మనసులో డ్యాన్స్ అనే ముద్రపడిపోయింది. ఇది చాలా పాజిటివ్ అయినప్పటికీ ఒక నటిగా నన్ను నేను నిరూపించుకోవాలని ఉంటుంది. ఈ సినిమాతో నాకు ఆ అవకాశం దొరికిందని అనిపించింది."
ఈ సినిమా తనకు ఓ సవాల్ అంటోంది శ్రీలీల. ఇలాంటి అవకాశం మళ్లీ తనకు రాదని, భవిష్యత్తులో వచ్చినా తను చేయనని అంటోంది. అందుకే తన కెరీర్ లో ఇది డిఫరెంట్ మూవీ అంటోంది.
"ఈ సినిమా మొతాన్ని ఒక సవాల్ గా తీసుకున్నాను. ఒక ఆర్టిస్ట్ గా నన్ను నేను పరీక్షించుకునే సమయం సిట్యువేషన్ వచ్చింది. విజ్జి పాప పాత్ర నాలో ఉండిపోయింది. ఆడ పిల్ల లేడీ పిల్లలా కాదు పులి పిల్లలా ఉండాలనే ఓ డైలాగ్ ఇందులో ఉంది. ఇది హీరో తపన. ఈ తపన ని ప్రేక్షకులు సరిగ్గా అర్ధం చేసుకోవాలంటే నేను సరిగ్గా చేయాలి. ఆ కసితోనే సినిమా చేశాను."
ఈ దసరా కానుకగా థియేటర్లలోకి వస్తోంది భగవంత్ కేసరి సినిమా. అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో, బాలయ్యకు వరసకు కూతురి పాత్రలో నటించింది శ్రీలీల.