SreeLeela: రెండో సినిమాకే కోటి పారితోషికం

SreeLeela: చేసింది ఒకే ఒక్క సినిమా. కానీ క్రేజ్ మాత్రం అమాంతం. ఇప్పుడీ క్రేజ్ ను బ్రహ్మాండంగా క్యాష్ చేసుకుంటోంది హీరోయిన్ శ్రీలీల.

Advertisement
Update:2022-12-13 13:00 IST

ఇండస్ట్రీలో అంతే. ఒక్క హిట్ వచ్చిందంటే కెరీర్ తారాజువ్వలా దూసుకుపోతోంది. ప్రస్తుతం ఆ స్టేజ్ లోనే ఉంది హీరోయిన్ శ్రీలీల. చేసింది ఒకే ఒక్క సినిమా. అది కూడా ఫ్లాప్ మూవీ. అయితేనేం శ్రీలీల అందాలకు తెగ క్రేజ్ వచ్చింది. ఆమె స్టెప్పులకు టాలీవుడ్ ఊగింది. ఫలితంగా ఈ ముద్దుగుమ్మకు వరుసపెట్టి ఆఫర్లు వస్తున్నాయి.

ఇప్పటికే చేతినిండా అరడజను సినిమాలతో దూసుకుపోతున్న ఈ బ్యూటీ, ప్రస్తుతం సినిమాకు కోటి రూపాయల పారితోషికం తీసుకుంటోంది. ఒక్క సినిమా అనుభవంకే కోటి రూపాయల రెమ్యూనరేషన్ అంటే చాలా ఎక్కువ. ఈ విషయంలో ప్రస్తుతం మార్కెట్లో ఉన్న చాలామంది హీరోయిన్లను వెనక్కి నెట్టింది శ్రీలీల.

ఇది చాలదన్నట్టు తాజాగా మరో బంపరాఫర్ అందుకుంది ఈ బ్యూటీ. వెంటనే కాల్షీట్లు కేటాయిస్తే, సినిమాకు కోటిన్నర ఇచ్చేందుకు ఓ నిర్మాత ముందుకొచ్చాడు. ఇది నితిన్ సినిమా. ఈ ప్రాజెక్టుకు కనుక శ్రీలీల ఓకే చెబితే, రెమ్యూనరేషన్ పరంగా ఆమె నెక్ట్స్ లెవెల్ కు చేరుకున్నట్టే.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తన రెండో ప్రాజెక్టు ధమామా రిలీజ్ కోసం వెయిట్ చేస్తోంది. ఆ సినిమా సక్సెస్ అయితే శ్రీలీల, ఇక టాప్ హీరోయిన్లకు పోటీ ఇచ్చినట్టే. అన్నట్టు ఈమె ప్రస్తుతం ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతోంది. ముంబయిలో ఎగ్జామ్స్ రాస్తోంది.

Tags:    
Advertisement

Similar News