Sreeleela | ఫస్ట్ టైమ్ ఎమోషనల్ మూవీ చేసిందంట

Sreeleela - స్కంద మూవీ తన కెరీర్ లో తొలి ఎమోషనల్ మూవీ అని చెప్పుకొచ్చింది స్టార్ హీరోయిన్ శ్రీలీల.

Advertisement
Update:2023-09-27 22:40 IST

బోయపాటి శ్రీను, రామ్ పోతినేని కలిసి చేసిన యాక్షన్ మూవీ ‘స్కంద’-ది ఎటాకర్. మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల ఇందులో హీరోయిన్ గా నటించింది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పై నిర్మాత శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించాడు. తమన్ సంగీతం అందించిన స్కంద ఆల్బమ్ సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. స్కంద టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రేపు విడుదలకానున్న ఈ సినిమాపై ప్రత్యేకంగా మాట్లాడింది హీరోయిన్ శ్రీలీల. ఆమె మాటల్లోనే..

- స్కంద సినిమాలో నా పాత్ర చాలా ప్రత్యేకం. ఇందులో చాలా రూల్స్ నియమాలు పాటించే అమ్మాయిగా కనిపిస్తాను. నా పాత్రలో మాస్ క్లాస్ రెండూ మిక్స్ లో ఉంటాయి. ఇందులో కొన్ని సీన్స్ నా రియల్ లైఫ్ నుంచి కూడా వచ్చాయి.

- స్కంద చాలా మంచి అనుభవం. రామ్ తో నా కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది. బోయపాటి చాలా ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారు. డబ్బింగ్ చెప్పినపుడు చాలా ఎంజాయ్ చేశాను.

- రామ్ తో డ్యాన్స్ మ్యాచ్ చేయడం కష్టం. అయితే ఇద్దరం ఒకరికొకరు కాంప్లిమెంట్ చేస్తూ చేశాం. నేను కూడా ఏవో కొత్తకొత్తగా ప్రయత్నించాను.

- తొలిసారి ఎమోషన్ పండించే సీన్స్ చేశాను. దీనితో పాటు సరదాగా ఉండే సన్నివేశాలు ఉంటాయి. కాలేజ్ డ్రామా కూడా ఉంది. స్కంద చేస్తున్నప్పుడు యాక్షన్ సినిమాలపై మరింత గౌరవం పెరిగింది. మాస్ ఎలిమెంట్స్, ఫైట్స్ ని అద్భుతంగా చూపించడం బోయపాటి గారి మార్క్.

- ధమాకా సినిమాకి కూడా నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పాను. స్కంద విషయానికి వస్తే.. బోయపాటి శ్రీను ముందే ట్రైన్ చేశారు. బోయపాటి గారి డైలాగ్స్ పవర్ ఫుల్ గా ఉంటాయి. ఇలాంటి పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్పడం నాకు ఇదే మొదటిసారి.

Tags:    
Advertisement

Similar News