Pushpa 2 Movie: పుష్పపై గరికపాటి దెబ్బ గట్టిగా తగిలిందే..!
Garikipati Narasimha Rao Comments On Pushpa Movie: పుష్ప ఫస్ట్ పార్ట్‌పై విమర్శలు వచ్చిన నేపథ్యంలో దర్శకుడు సుకుమార్ అలర్ట్ అయ్యాడు. తాజాగా విడుదలైన పుష్ప-2 టీజర్‌ను గమనిస్తే హీరో క్యారెక్టరైజేషన్‌ని పూర్తిగా మార్చినట్లు కనిపిస్తోంది. పుష్ప క్యారెక్టర్‌ను రాబిన్ హుడ్ తరహాలో మార్చారు.
పుష్ప-2 సినిమాపై ప్రవచనకర్త గరికపాటి దెబ్బ గట్టిగా తగిలినట్లు ఉంది. అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా కాసేపటి కిందట పుష్ప-2 టీజర్‌ను రిలీజ్ చేశారు. అయితే అందులో పుష్ప క్యారెక్టర్ స్మగ్లర్‌లా కాకుండా రాబిన్ హుడ్ తరహాలో కనిపించింది. పుష్ప ఫస్ట్ పార్ట్‌లో హీరో క్యారెక్టర్‌పై విమర్శలు వచ్చిన నేపథ్యంలో పార్ట్ -2లో క్యారెక్టర్‌ను మార్చినట్లు తెలుస్తోంది. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ క్యారెక్టర్ నెగటివ్‌గా ఉంటుంది. రోజంతా కష్టపడి 100 రూపాయలు సంపాదించడం కన్నా.. తప్పుచేసి అయినా 1000 రూపాయలు సంపాదించాలనే మనస్తత్వం హీరోది. అందులో పుష్ప ఎంట్రీ సీన్ కూడా అలాగే ఉంటుంది. ఆ తర్వాత పుష్ప ప్రస్థానం కూలి నుంచి స్మగ్లర్ దాకా చేరుకుంటుంది. నేర సామ్రాజ్యాన్ని శాసించే స్థాయికి పుష్ప చేరుకుంటాడు.
అయితే పుష్ప మూవీ భారీ హిట్ అయినా సినిమాలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వ్యక్తిని హీరోగా చూపించడంపై విమర్శలు వచ్చాయి. దీనిపై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి ఘాటు విమర్శలు చేశారు. 'స్మగ్లింగ్ చేసే వ్యక్తిని హీరోని చేశారు. పైగా హీరో తగ్గేదేలే.. అంటాడు. స్మగ్లింగ్ చేసే వ్యక్తి ఎవరైనా తగ్గేదేలే.. అంటాడా.. అతడు ఏమైనా హరిశ్చంద్రుడా? ఆ మాట అనటానికి.. సమాజానికి ఏం నేర్పిస్తున్నారు? నాకు ఈ సినిమా డైరెక్టర్, హీరో కనిపిస్తే ఈ విషయమై ప్రశ్నిస్తా..కడిగి పారేస్తా..' అని గరికపాటి తీవ్ర విమర్శలు చేశారు.
పుష్ప ఫస్ట్ పార్ట్‌పై విమర్శలు వచ్చిన నేపథ్యంలో దర్శకుడు సుకుమార్ అలర్ట్ అయ్యాడు. తాజాగా విడుదలైన పుష్ప-2 టీజర్‌ను గమనిస్తే హీరో క్యారెక్టరైజేషన్‌ని పూర్తిగా మార్చినట్లు కనిపిస్తోంది. పుష్ప క్యారెక్టర్‌ను రాబిన్ హుడ్ తరహాలో మార్చారు. పుష్ప మా పిల్లల వైద్యానికి సాయం చేశాడు..కూడు పెట్టాడు..పెళ్లిళ్లు చేశాడు.. అని అతడి మద్దతుదారులు మాట్లాడటం టీజర్‌లో కనిపించింది. మొత్తానికి పుష్ప సినిమాపై గరికపాటి దెబ్బ బాగానే తగిలినట్లు ఉంది. దెబ్బకు సినిమా స్టోరీ కూడా మారిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.