అల్లు అర్జున్‌కు షాక్..14 రోజుల రిమాండ్

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నాంపల్లి కోర్టు అల్లు అర్జున్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది.

Advertisement
Update:2024-12-13 17:20 IST

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై నమోదైన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో కాసేట్లో పోలీసులు బన్నీని చంచల్‌గూడ జైలుకు తరలించనున్నారు. తనపై పెట్టిన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని కోరుతూ అల్లు అర్జున్ పెట్టుకున్న క్వాష్ పిటిషన్ పై ప్రస్తుతం హైకోర్టులో విచారణ జరిగింది. మెయిన్ గేటు నుంచి కాకుండా వెనక గేటు నుంచి బన్నీని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.

జైలు లోపల సైతం భద్రతను కట్టుదిట్టం చేస్తారు. అల్లు అర్జున్‌కు జైలులో అందరి రిమాండ్ ఖైదీలకు వడ్డించే భోజనం స్థానంలో ఇంటినుంచి భోజనాన్ని అనుమతించే అవకాశం ఉంటుంది. ఆయన పాపులర్ సినీ నటుడు కావడంతో ఆయనకు జైలులో కొన్ని ప్రత్యేక వసతులు కల్పించే అవకాశం ఉంది. రిమాండ్ ఖైదీల్లో ప్రముఖ వ్యక్తులు ఉంటే ఇంటి భోజనాన్ని అనుమతిస్తారు. రిమాండ్ ఖైదీలు అందరితో పాటు కాకుండా ఆయనకు ప్రత్యేకంగా ఓ గదిని కేటాయిస్తారు. ఆ గది చుట్టూ భద్రత ఏర్పాటుచేస్తారు.

Tags:    
Advertisement

Similar News