Sapthaa Records: సౌత్ లో సప్తా రికార్డ్స్ సంచలనం!

Sapthaa Records: బాక్సాఫీసు హిట్స్ కాంతారా, దృశ్యం 2, జగమే తంతిరమ్‌ లు సహా చాలా సినిమాలు ఈ స్టూడియోలో శబ్ద సౌందర్యాన్ని అద్దుకుని ప్రేక్షకుల ముందుకొచ్చినవే.

Advertisement
Update:2023-06-01 12:50 IST

సంగీతమైనా, సినిమాలైనా ఆడియో ముఖ్యపాత్ర పోషిస్తుంది. తక్కువ నాణ్యత గల ఆడియో తక్కువ ఆనందాన్ని ఇస్తుంది. అందువల్ల సంగీత దర్శకులు, నిర్మాతలు తమ ఆడియోని అగ్రశ్రేణిగా మార్చడానికి ప్రయత్నిస్తారు. కనుక అధిక నాణ్యత గల ఆడియో కోసం అధునాతన సౌండ్ స్టూడియో అవసరం. ఈ అవసరాన్ని తీరుస్తూ కేరళలో అంటే మాలీవుడ్ లో ఒక సౌండ్ స్టూడియో ఏర్పాటైంది. కేరళ రాష్ట్రం కొచ్చిలోని కలూర్‌లో ఇటీవల ప్రారంభించిన అత్యాధునిక సౌకర్యాలని అందించే సౌండ్ స్టూడియో, సప్తా రికార్డ్స్ సౌత్ సినిమా ఫీల్డులో పెను సంచలనాలు సృష్టిస్తోంది.

బాక్సాఫీసు హిట్స్ కాంతారా, దృశ్యం 2, జగమే తంతిరమ్‌ లు సహా చాలా సినిమాలు ఈ స్టూడియోలో శబ్ద సౌందర్యాన్ని అద్దుకుని ప్రేక్షకుల ముందుకొచ్చినవే. డాల్బీ అట్మాస్ మ్యూజిక్ మిక్స్ సదుపాయాన్నీ, అత్యుత్తమ నాణ్యత గల ఆడియోనీ అందించడం ద్వారా దేశంలోనే ఇలాటిది మొట్టమొదటి స్టూడియో కావడం వల్ల, నిర్మాతలు ఇప్పటికే దీని పట్ల ఆకర్షితులవుతున్నారు. స్టూడియో కేరళలో వున్నప్పటికీ, దాని నాణ్యత కోసం, సౌకర్యాల కోసం తమిళం, తెలుగు, కన్నడ సినిమాల నిర్మాతలు ఇక్కడి కొచ్చేస్తున్నారు.

ఈ స్టూడియోని భారతీయ సంగీతాన్ని, సినిమాల్నీ అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళడానికి ఒక దృష్టితో కిషన్ మోహన్ స్థాపించారు. లాస్ ఏంజిలిస్ లో హాలీవుడ్ స్పానిష్, ఇంగ్లీష్ కంపోజర్‌లతో కలిసి పని చేసిన అనుభవంతో సప్తా రికార్డ్స్ ని స్థాపించారు. దేశంలోనే తొలిసారిగా డాల్బీ అట్మాస్ మ్యూజిక్ మిక్స్ సదుపాయాన్ని అందిస్తున్న స్టూడియోగా ఇది పేర్గాంచింది. ఇప్పటి వరకు తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో దాదాపు 150 సినిమాలిక్కడ ఆడియో గెటప్ పొందాయి. ఈ స్టూడియోలో సౌండ్ ఎఫెక్ట్స్ పొందిన కాంతారా, దృశ్యం 2, జగమే తంతిరమ్, 777 చార్లీ, భూతకాలం, ఆర్కారియాం, తురముఖం, వన్, నాయట్టు, జోజి, కురుప్పు, హృదయం, ఆపరేషన్ జావా, మాలిక్ మొదలలైన సినిమాలు హిట్ కావడంతో నిర్మాతలు, ఈ స్టూడియోకి ఎగబడుతున్నారు.

సంగీతం, మిక్సింగ్, డబ్బింగ్ లేదా ఎడిటింగ్ వంటి ఆడియో ప్రొడక్షన్‌ కి అవసరమైన అన్ని సౌకర్యాల్ని అందించే కేంద్రంగా స్టూడియోని తీర్చి దిద్దారు. స్టూడియోలో బహుళ విభాగాలు వున్నాయి. ఇది మ్యూజిక్ డైరక్టర్లకు డ్రీమ్ వరల్డ్. సంగీత నిర్మాణం, ప్రోగ్రామింగ్, అమరిక, మిక్సింగ్ వంటి సౌకర్యాలకి ఇది సింగిల్ విండో వంటి కేంద్రం. చలన చిత్రా నిర్మాణానికి అనివార్య ప్రక్రియలైన వాయిస్‌ రికార్డింగ్, మిక్సింగ్, డబ్బింగ్, ఎడిటింగ్ వంటి సౌకర్యాలు ఇక్కడ వున్నాయి.

ఇంకా ఈ సంస్థ సప్తా శిక్షణా సంస్థని కూడా నడుపుతోంది. SIFT, లేదా సప్తా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిల్మ్ టెక్నాలజీస్ పేర ప్రాంభించిన శిక్షణా కేంద్రంలో- డాల్బీ అట్మాస్ మిక్సింగ్ యూనిట్, ప్రో టూల్స్, డాల్బీ ప్రీ-మిక్స్ సూట్‌లు, మెంటార్‌షిప్, మ్యూజిక్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్, సౌండ్ డిజైన్- ఇంజనీరింగ్, కలర్ గ్రేడింగ్, పోస్ట్ మాడర్న్ సాఫ్ట్ వేర్‌తో కూడిన డిజిటల్ సినిమాటోగ్రఫీలో శిక్షణని అందిస్తోంది.

డాల్బీ, డిస్నీ, సన్ పిక్చర్స్ వంటి పరిశ్రమలతో భాగస్వామ్యాన్ని కూడా కలిగి వుంది. అంతేగాక డీఐ సూట్‌లు, అట్మాస్ డాల్బీ విజన్ హెచ్డీ ఆర్ సూట్‌లు, బార్కో 4కే ప్రొజెక్షన్ సూట్‌లలో అత్యంత ఆధునిక పరికరాలు ఏర్పాటు చేశారు. హోమ్ థియేటర్లకి, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కి అనువైన అట్మాస్ హెచ్ ఈ సెటప్ కూడా స్టూడియోలో అందుబాటులో వుంది. ఇది సౌండ్ డిజైన్, ప్రొడక్షన్ సౌండ్ సర్వీసెస్, ఫోలీ ఎఫెక్ట్స్/ఎడిటింగ్, మిక్సింగ్ మాస్టరింగ్, మ్యూజిక్ ప్రొడక్షన్, ప్రోగ్రామింగ్, ఇంకా అరేంజ్‌మెంట్ కోసం సౌకర్యాలని కలిగి వుంది.

దక్షిణ భారత చలనచిత్రాలు గత రెండు సంవత్సరాలుగా వాటి కంటెంట్‌పై మాత్రమే కాకుండా, సాంకేతిక అంశాలపై కూడా దృష్టి సారిస్తున్నాయి. దీంతో అధునాతన సాంకేతికా తో సప్తా వంటి స్టూడియో ఒక వరంలా కన్పిస్తోంది. స్టూడియో అంతర్జాతీయ స్థాయి ఫలితాల్ని అందిస్తోంది కాబట్టి, అత్యుత్తమ అవుట్‌పుట్ పొందడానికి నిర్మాతలు ఇక్కడికి విచ్చేస్తున్నారు.

సప్తా వాస్తవానికి ఆడియోకి సంబంధించిన ప్రతిదానికీ ఒక-స్టాప్ గమ్యస్థానంగా వుంది. త్వరలో బాలీవుడ్‌ కి విస్తరించే అవకాశముంది. 


Full View


Tags:    
Advertisement

Similar News