Demonte Colony 2 | ఆర్జీవీ మెచ్చిన సినిమా

Demonte Colony 2 - తమిళ్ లో ఇప్పటికే హిట్టయింది డిమాంటీ కాలనీ 2. ఇప్పుడు తెలుగు ఆడియన్స్ పై ఫోకస్ పెట్టింది.

Advertisement
Update:2024-08-21 22:58 IST
Demonte Colony 2 | ఆర్జీవీ మెచ్చిన సినిమా
  • whatsapp icon

బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ “డీమాంటీ కాలనీ 2” ఈ నెల 23న తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అయింది. నైజాంలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ పంపిణీ చేస్తోంది. ఈ సినిమాను శ్రీ బాలాజీ ఫిలింస్ బ్యానర్ పై బి సురేష్ రెడ్డి, బి.మానస రెడ్డి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

ఈ సినిమాలో అరుల్ నిధి, ప్రియ భవానీ శంకర్ జంటగా నటించారు. అరుణ్ పాండియన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అజయ్ ఆర్ జ్ఞానముత్తు ఈ సినిమాకు దర్శకుడు. తాజాగా హైదరాబాద్ లో “డీమాంటీ కాలనీ 2” ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకులు రామ్ గోపాల్ వర్మ, అజయ్ భూపతి, నిర్మాత బెక్కెం వేణుగోపాల్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు.

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ – "నేను 20 ఏళ్ల క్రితం భూత్ అనే సినిమాను చేశాను. అది అపార్ట్ మెంట్ లో జరుగుతుంది. ఆ సినిమా రిలీజ్ అయ్యాక అపార్ట్ మెంట్స్ లోకి వెళ్లేందుకు కొంతకాలం భయపడి చాలామంది వెళ్లలేదు. డీమాంటీ కాలనీ రిలీజ్ అయ్యాక ఆ కాలనీ పేరు పెట్టినందుకు కాంట్రవర్సీ జరిగిందని దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు నాతో చెప్పారు. ఈ సినిమా ఆల్రెడీ సక్సెస్ ఫుల్ ఫిల్మ్. ఇప్పుడు మరో భాషలోకి వస్తోంది అంతే." అన్నారు.

“డీమాంటీ కాలనీ 2” తమిళంలో మంచి హిట్ అయింది. ఈ మూవీకి 3, 4 పార్ట్స్ కూడా రాబోతున్నాయి. సెకండ్ పార్ట్ లోని ఆర్టిస్టులంతా మూడో పార్ట్ లో కూడా కంటిన్యూ అవుతారు. శామ్ సీఎస్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

Tags:    
Advertisement

Similar News