చండీ యాగం చేసిన రేణూ దేశాయ్‌..వీడియో వైరల్

ప్రముఖ నటి రేణూ దేశాయ్ తాజాగా త‌న ఇంట్లో చండీ హోమం నిర్వహించారు. ఈ విషయాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆమె తెలిపింది.

Advertisement
Update:2024-10-19 19:23 IST

ప్రముఖ నటి రేణూ దేశాయ్ తాజాగా త‌న ఇంట్లో చండీ హోమం నిర్వహించారు. ఈ విషయాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆమె తెలిపింది. శరద్‌ పూర్ణిమ సందర్భంగా భక్తి శ్రద్ధలతో చండీ హోమం పూజ కార్యక్రమంలో ఆమె తనయుడు అకీరా నందన్‌ కూడా పాల్గొన్నాడు. దీనికి సంబంధించిన ఓ వీడియోను తాజాగా ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు. భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని భవిష్యత్తు తరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉందని రేణూ పేర్కొన్నారు.

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో విడిపోయిన అనంత‌రం సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తు సేవా ధృక్ప‌థం ఉన్న వ్య‌క్తిగా గుర్తింపు తెచ్చుకుంది. తల్లిదండ్రులుగా మన ఆచారాల ప్రాముఖ్యతను, పూర్వీకులు అనుసరించిన సంప్రదాయాలను పిల్లలకు నేర్పించాలి’’ అని రాసుకొచ్చారు. అంతేకాకుండా, పూజలు చేసే సమయంలో ఆర్భాటాలకు పోవద్దని.. ప్రశాంతతో భక్తిపైనే దృష్టి పెట్టాలని తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.రేణూ దేశాయ్‌ దాదాపు 20 ఏళ్ల తర్వాత ‘టైగర్‌ నాగేశ్వరరావు’లో సినిమాలో రేణూ దేశాయ్ నటించారు.

Tags:    
Advertisement

Similar News