Mr Bachchan | ఆగస్ట్ 15కి రవితేజ సినిమా

Mr Bachchan - రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాకు విడుదల తేదీ ప్రకటించారు. ఆగస్ట్ 15న రిలీజ్ అవుతోంది ఈ మూవీ.

Advertisement
Update: 2024-07-21 17:25 GMT

మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్ 'మిస్టర్ బచ్చన్'. రీసెంట్ గా రిలీజైన షోరీల్ వీడియో కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా రిలీజైన పాట కూడా హిట్టయింది.

ఇదే ఊపులో సినిమాకు విడుదల తేదీ ప్రకటించారు. ఆగస్ట్ 15 కానుకగా థియేటర్లలోకి వస్తోంది మిస్టర్ బచ్చన్ మూవీ. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది.

"మిస్టర్ బచ్చన్" షూటింగ్ బ్యూటీఫుల్ కాశ్మీవ్యాలీలో రీసెంట్ గా జరిగింది. ఈ షెడ్యూల్ తో 90శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంతో భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా పరిచయమౌతోంది.

90% చిత్రీకరణ పూర్తి కావడంతో, విడుదల తేదీని ప్రకటించారు. హిందీలో వచ్చిన రైడ్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది మిస్టర్ బచ్చన్. అయితే ఇది రీమేక్ సినిమా అనిపించదంటున్నాడు హరీశ్ శంకర్. 

Tags:    
Advertisement

Similar News