Thiragabadara Swami | రాజ్ తరుణ్ సినిమాకు విడుదల తేదీ ఫిక్స్

Thiragabadara Swami - రాజ్ తరుణ్ కొత్త సినిమా పేరు తిరగబడరాసామీ. ఈ సినిమాకు విడుదల తేదీ ఫిక్స్ చేశారు.

Advertisement
Update:2024-07-12 14:08 IST

రాజ్ తరుణ్ హీరోగా, ఎ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న ఎంటర్‌టైనర్ 'తిరగబడరసామీ'. మాల్వి మల్హోత్రా హీరోయిన్ గా నటిస్తోంది. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యూత్ ని ఆకట్టుకునే రొమాన్స్ తో పాటు ఫ్యామిలీని ఆకర్షించే సెంటిమెంట్, మాస్ ని అలరించే హై వోల్టేజ్ యాక్షన్, ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రాన్ని రూపొందించారు.

తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు మేకర్స్. ఆగస్ట్ 2న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రాగా.. పాటలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.

సెన్సేషనల్ బ్యూటీ మన్నారా చోప్రా ఈ చిత్రంలో ఓ డిఫరెంట్ క్యారెక్టర్ తో పాటు ఒక స్పెషల్ సాంగ్ లో అలరించబోతుంది. మకరంద్ దేశ్‌పాండే, జాన్ విజయ్, రఘు బాబు, అంకిత ఠాకూర్, పృధ్వి, ప్రగతి, రాజా రవీంద్ర, బిత్తిరి సత్తి ఇతర కీలక పాత్రలు పోషించారు. 

Tags:    
Advertisement

Similar News

'అఖండ 2' షురూ