Prabhas: పెళ్లి చేసుకుంటా కానీ ఎప్పుడో తెలీదు

Prabhas: పెళ్లికి తను వ్యతిరేకం కాదని స్పష్టం చేశాడు ప్రభాస్. అయితే ఎప్పుడు పెళ్లి చేసుకుంటానో తనకే తెలియదంటూ ప్రకటించాడు.

Advertisement
Update:2022-12-30 09:02 IST

తన పెళ్లిపై మరోసారి స్పందించాడు ప్రభాస్. తను కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని కానీ ఎప్పుడనేది తనకు కూడా తెలియదంటున్నాడు. రాసి పెట్టి ఉంటే తన పెళ్లి కచ్చితంగా జరుగుతుందంటున్నాడు.

బాలయ్య చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్-2కు ప్రత్యేక అతిథిగా వెళ్లాడు ప్రభాస్. షో ప్రారంభంలోనే పెళ్లిపై అడిగేశాడు బాలయ్య. దీంతో కాసేపు తటపటాయించిన ప్రభాస్, నుదిటిపై రాసిపెట్టి ఉంటే జరుగుతుంది అన్నట్టు సింబాలిక్ గా ఎక్స్ ప్రెషన్ ఇచ్చాడు.

ఆమధ్య బాలయ్య షోకు శర్వానంద్ వచ్చాడు. ప్రభాస్ పెళ్లి చేసుకున్న తర్వాత తను చేసుకుంటానంటూ స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఇదేవిషయాన్ని ప్రభాస్ దగ్గర ప్రస్తావిస్తే, తను సల్మాన్ చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటానంటూ ఫన్నీగా రియాక్ట్ అయ్యాడు.

పెళ్లికి తను వ్యతిరేకం కాదనే విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టం చేశాడు ప్రభాస్. ఇంటిలో తన పెళ్లి పై ఎప్పటికప్పుడు చర్చ జరుగుతుందని, సోదరి, వదిన సహకారంతో ఆ చర్చల నుంచి తప్పించుకుంటానని తెలిపాడు ప్రభాస్.

Tags:    
Advertisement

Similar News