Poonam Kaur | అందులోకి నన్ను లాగొద్దు ప్లీజ్

Poonam Kaur - రాజకీయాల్లోకి వస్తానంటూ తనపై జరుగుతున్న ప్రచారాన్ని పూనమ్ కౌర్ ఖండించింది. ఏదైనా ఉంటే తనే ప్రకటిస్తానని కూడా క్లారిటీ ఇచ్చింది.

Advertisement
Update:2023-09-26 23:06 IST

నిత్యం వార్తల్లో నలుగుతుంది పూనమ్ కౌర్. ఒకప్పుడు సినిమాలు చేసిన ఈ హీరోయిన్, ఇప్పుడు సామాజిక కార్యక్రమాలతో బిజీ అయింది. అయితే ఆమెపై ఎప్పటికప్పుడు కొన్ని పుకార్లు వస్తూనే ఉన్నాయి. వాటిని ఆమె ఖండిస్తూనే ఉంది. తాజాగా ఆమెపై మరికొన్ని ఊహాగానాలు చెలరేగాయి. త్వరలోనే ఆమె ఓ పొలిటికల్ పార్టీలో చేరుతుందనేది ఆ రూమర్. వాటిని పూనమ్ కౌర్ ఖండించారు.

"ఇప్పటివరకు నేను ఏ రాజకీయ పార్టీ కండువా కప్పుకోలేదు. ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాను. సమస్య ఆధారంగానే నేను స్పందిస్తుంటాను. ఈ మధ్య కొందరు రాజకీయ నాయకులు వారి ప్రయోజనాల కోసం నన్ను ఓ పావుగా వాడాలనుకుంటున్నారు. ఇది సముచితం కాదు. గత ఎన్నికలలో కూడా ఇలాంటి వికృత చేష్టలు చేశారు. మరికొందరు పైశాచిక ఆనందం పొందాలనుకుంటున్నారు. ఒక మహిళపై ఇలాంటి కుట్రలు తగవు. మరికొందరు నాయకులు సానుభూతి పేరుతో నాకు, నా కుటుంబ సభ్యులకు ఫోన్లు చేస్తున్నారు. నేను సిక్కుబిడ్డను. త్యాగాలు మాకు తెలుసు. పోరాటాలు తెలుసు. దయచేసి నన్ను మీ రాజకీయాల కోసం నన్ను లాగొద్దు."

ప్రస్తుతం చేనేత కళాకారుల తరఫున పనిచేస్తోంది పూనమ్ కౌర్. దీనికి సంబంధించి ఆమె దేశవ్యాప్తంగా పర్యటనలు చేస్తోంది. ఈ ప్రయాణంలో ఎంతోమంది సామాజిక ఉద్యమకారుల్ని కలిసే భాగ్యం కలిగిందని చెప్పుకొచ్చింది.

"ప్రస్తతం నేను చేనేత కళాకారుల కోసం పనిచేస్తున్నాను. గత 2 సంవత్సరాలుగా వారి కోసం జాతీయ చేనేత దినోత్సవ రూపకర్త యర్రమాద వెంకన్న నేత గారితో కలిసి దేశవ్యాప్త పర్యటన చేస్తున్నాను. ఇప్పటికే 15 రాష్ట్రాలు, 21 రాజకీయ పార్టీలకు సంబంధించిన 100కు పైగా పార్లమెంటు సభ్యులను కలిసి వారి మద్దతు తీసుకున్నాము. ఈ ప్రయాణంలో అనేకమంది సామాజిక ఉద్యమకారులను కలిసాము. మహిళా ఉద్యమ నేతలతో చర్చించాము. మహిళా హక్కుల కోసం నిరంతరం నేను గళం విప్పుతూనే ఉంటాను. చేనేత మరియు మహిళా ఉద్యమాలను జాతీయస్థాయిలో నిర్మించే క్రమంలో ఉన్నాం"

రాజకీయ రంగప్రవేశంకు సంబంధించి ప్రస్తుతం తనకు ఎలాంటి ఆలోచనలు లేవని, ఒకవేళ ఏదైనా అప్ డేట్ ఉంటే, స్వయంగా తను తెలియజేస్తానని పూనమ్ కౌర్ వెల్లడించింది.

Tags:    
Advertisement

Similar News