కాలికి గాయంతో ఆస్పత్రిలో చేరిన మంచు మనోజ్‌

ఆస్తుల విషయంలో మోహన్‌బాబు, ఆయన తనయుడు మనోజ్‌ మధ్య గొడవ జరిగిందని పొద్దున మీడియాలో ప్రచారం

Advertisement
Update:2024-12-08 17:30 IST

సినీ నటుడు మంచు మనోజ్‌ గాయపడ్డారు. ఆయన కాలికి గాయమవడంతో బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స కోసం వచ్చారు. ఆస్పత్రి వైద్యులు మనోజ్‌కు పరీక్షలు నిర్వహించారు. ఆయన వెంట సతీమణి మౌనిక కూడా ఉన్నారు. సమాచారం తెలుసుకున్న మీడియా వర్గాలు ఆస్పత్రి చేరుకుని మనోజ్‌ను ప్రశ్నించగా, ఇరువురూ స్పందించలేదు. నడవటానికి కూడా ఇబ్బంది పడుతూ మనోజ్‌ ఆస్పత్రికి వెళ్తున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నది.

తమ విషయంలో జరుగుతున్న ప్రచారంపై మోహన్‌బాబు కుటుంబం స్పందించింది. ఆ వార్తలను ఖండించింది. అసత్య ప్రచారాలు చేయవద్దంటూ ఆ వార్తలు రాసిన మీడియాకు సూచించింది. అసలేం జరిగిందటే.. ఆస్తుల విషయంలో మోహన్‌బాబు, ఆయన తనయుడు మనోజ్‌ మధ్య గొడవ జరిగిందని, ఒకరిపై ఒకరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారంటూ ఆదివారం ఉదయం వార్తలు వచ్చాయి. మనోజ్‌ గాయాలతో వచ్చి మరీ కంప్లైంట్‌ చేశారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే మంచు ఫ్యామిలీ స్పందించింది. అయితే తాజాగా మనోజ్‌ కాలికి గాయం కావడం, వాళ్ల కుటుంబంలో ఆస్తులపై జరిగిన గొడవలపై స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది.


Tags:    
Advertisement

Similar News