సర్దార్ కథ చెప్పేసిన కార్తి

సర్దార్ లో డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తున్నాడు కార్తి. ఇంతకీ ఈ సినిమా కథ ఏంటి? ఆ స్టోరీలైన్ ఏంటో స్వయంగా కార్తి బయటపెట్టాడు.

Advertisement
Update:2022-10-21 12:15 IST

ఈకాలం సినిమాపై లేనిపోని అంచనాలు పెంచడం కరెక్ట్ కాదు. తమ సినిమాలో ఏముంది, ఏం చూపించబోతున్నామనే విషయాన్ని ముందుగానే ప్రేక్షకులకు చెప్పేస్తే మంచిది. అసలే ఆక్యుపెన్సీ లేకుండా థియేటర్లు నడుస్తున్న ఈ కాలంలో అనవసర అంచనాలు పెంచితే మొదటికే మోసం వస్తుంది.

ఈ విషయంలో హీరో కార్తి చాలా క్లియర్ గా ఉన్నాడు. తన కొత్త సినిమాపై ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నారు. అక్కడితో ఆగకుండా విడుదలకు ముందే కథ కూడా చెప్పేశాడు. కార్తి మాటల్లో సర్దార్ స్టోరీ ఇది..

"ఇండియన్ స్పై థ్రిల్లర్ గా సర్దార్ వస్తోంది. ఇందులో మొదటిసారి తండ్రీకొడుకుల పాత్రల్లో కనిపిస్తున్నా. కథ ప్రకారం చాలా గెటప్స్ ఉంటాయి. ఇప్పటివరకూ నేర్చుకున్నది ఒక పరీక్షలా వుంది. ఒక గ్రామంలో పెరిగిన రంగస్థల నటుడు గూఢచారిగా మారి ఏం చేశాడనేది దర్శకుడు మిత్రన్ అద్భుతంగా చూపించారు. 1980లో జరిగే కథ ఇది. అప్పటి ప్రపంచాన్ని చాలా వండర్ ఫుల్ గా తీశారు. సర్దార్ లో చాలా ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. ట్రైలర్ లో ఒక ఫైల్ మిస్సింగ్ గురించి చూపించాం కదా.. అందులో మనం బ్రతకడానికి కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి."

ఇలా సర్దార్ సినిమాలో ఏముందే చెప్పేశాడు కార్తి. ఈ సినిమాలో ముసలి పాత్ర కోసం చాలా కష్టపడాల్సి వచ్చిందని, నాజర్ లాంటి నటుల సలహాలు-సూచనలు తీసుకున్నానని అంటున్నాడు కార్తి. ఈరోజు థియేటర్లలోకి వచ్చింది సర్దార్ మూవీ. తెలుగులో నాగార్జున ఈ సినిమాను రిలీజ్ చేశాడు. 

Tags:    
Advertisement

Similar News