Bharateeyudu 2 | రేపే ప్రీ-రిలీజ్ ఫంక్షన్

Bharateeyudu 2 - కమల్ హాసన్ హీరోగా నటించిన సినిమా భారతీయుడు-2. రేపట్నుంచి ఈ సినిమా తెలుగు ప్రమోషన్స్ మొదలు కాబోతున్నాయి.

Advertisement
Update:2024-07-06 23:11 IST

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మిస్తున్న సినిమా ‘భార‌తీయుడు 2’. రేపు ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియ‌న్ సురేష్ ఎంట‌ర్‌టైన్మెంట్స్, సీడెడ్ హ‌క్కుల‌ను శ్రీల‌క్ష్మి మూవీస్ సంస్థ‌లు ద‌క్కించుకున్నాయి. చిత్ర యూనిట్ ప్రమోషనల్ ప్లానింగ్‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఇప్పటికే విడుద‌లైన పాట‌లు, ఇండియ‌న్ 2 ఇంట్రో గ్లింప్స్‌, ట్రైల‌ర్‌ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

28 ఏళ్ల ముందు భారతీయుడు చిత్రంతో బాక్సాఫీస్ సెన్సేష‌న్ క్రియేట్ చేసిన క‌మ‌ల్ హాసన్‌, శంక‌ర్ కాంబోలో వ‌స్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘భారతీయుడు 2’. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అంద‌రిలోనూ ఆస‌క్తి పెరిగిపోతుంది. ఈ త‌రుణంలో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌డానికి న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు భాగ్య‌న‌గ‌రంలో ఈ భారీ వేడుక‌ను ఏర్పాటు చేశారు.

ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించాడు. ఈ మూవీని ఇండియన్-2గా తమిళ-హిందీ భాషల్లో.. భారతీయుడు-2గా తెలుగులో విడుదల చేయబోతున్నారు.

Tags:    
Advertisement

Similar News