Janhvi Kapoor | హాస్పిటల్ బెడ్ పై జాన్వికపూర్

Janhvi Kapoor - జాన్వి కపూర్ అనారోగ్యానికి గురైంది. ఆమెకు ఫుడ్ పాయిజనింగ్ అయింది.

Advertisement
Update:2024-07-19 22:16 IST

బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కు ఫుడ్ పాయిజన్ అయింది. వెంటనే ఆమెను ముంబయిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. సౌత్ ముంబైలోని హెచ్‌ఎన్ రిలయన్స్ హాస్పిటల్‌లో ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని బోనీ కపూర్ ప్రకటించారు.

జాన్వీ కపూర్ ప్రస్తుతం చాలా బిజీగా ఉంది. తెలుగు, హిందీ సినిమాలతో పాటు ఫొటోషూట్స్ చేస్తూ బిజీగా కెరీర్ కొనసాగిస్తోంది. ఇలాంటి టైమ్ లో ఆమె ఇలా హాస్పిటల్ లో చేరడం బాధాకరం. ఆమెకు సంబంధించిన షెడ్యూల్స్ అన్నింటినీ వారం రోజుల పాటు వాయిదా వేశారు. వీటిలో దేవర షెడ్యూల్ కూడా ఉంది.

ఎన్టీఆర్ సరసన దేవర చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది జాన్వి కపూర్. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27 న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. జాన్వి ప్రభావం సినిమా రిలీజ్ డేట్ పై పడదు. ఈ సినిమా తర్వాత ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రాబోతున్న సినిమాలో జాన్వీ నటించబోతోంది. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఒదెల దర్శకత్వంలో నాని చేయబోయే కొత్త సినిమాలో కూడా జాన్వి కపూర్ నటించే అవకాశం ఉంది. 

Tags:    
Advertisement

Similar News