ఐఫా అవార్డులు: బెస్ట్‌ మూవీగా 'యానిమల్‌'

ఉత్తమ నటుడు- షారుఖ్‌ ఖాన్‌, ఉత్తమ నటి-రాణీ ముఖర్జీ

Advertisement
Update:2024-09-29 12:13 IST

ఇండియన్‌ సినీ పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా భావించే ఇంటర్నేషన్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడమీ (ఐఫా) అవార్డుల వేడుక అబుదాబిలో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మొదటిరోజు సౌత్‌ ఇండియన్‌ చిత్ర పరిశ్రమకు చెందిన సినిమాలు, సినీ ప్రముఖులకు అవార్డులు అందించారు. రెండో రోజు బాలీవుడ్‌ సినిమాలకు, నటీనటులకు పురస్కారాలు ప్రదానం చేశారు. ఇందులో హిందీలో ఉత్తమ చిత్రంగా 'యానిమల్‌' నిలిచింది. ఉత్తమ దర్శకుడిగా-విధు వినోద్‌ చోప్పా (12th ఫెయిల్‌), ఉత్తమ నటుడు- షారుఖ్‌ ఖాన్‌ (జవాన్‌), ఉత్తమ నటి-రాణీ ముఖర్జీ (మిసెస్‌ ఛటర్జీ వర్సెస్‌ నార్వే) అవార్డులు గెలుచుకున్నారు.

పుష్ప పాటకు షారుఖ్‌, విక్కీ స్టెప్పులు

అబుదాబి వేదికగా జరిగిన ఐఫా వేడులకు షారుఖ్‌ఖాన్‌, కరణ్‌జోహర్‌, విక్కీ కౌశల్‌ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా నటించిన పుష్ప సినిమాలోని 'ఊ అంటావా మావ' పాటకు షారుఖ్‌-విక్కీకౌశల్‌ స్టెప్పులు వేశారు. దీంతో ఒక్కసారిగా సందడి వాతావరణం నెలకొన్నది.

ఐఫా 2024 విజేతలు వీరే:

  • ఔట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ సినిమా : జయంతిలాల్‌, హేమా మాలిని
  • అచీవ్‌మెంట్ ఆన్‌ కంప్లీటింగ్‌ 25 ఇయర్స్‌ ఇన్‌ సినిమా : కరణ్‌ జోహార్‌
  • ఉత్తమ విలన్‌: బాబీ దేవోల్‌ (యానిమల్‌)
  • ఉత్తమ నటి: రాణీ ముఖర్జీ (మిసెస్‌ ఛటర్జీ వర్సెస్‌ నార్వే)
  • ఉత్తమ సహాయ నటుడు: అనిల్‌ కపూర్‌ (యానిమల్‌)
  • ఉత్తమ సహాయ నటి: షబానా అజ్మీ (రాకీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్‌ కహానీ )
  • ఉత్తమ దర్శకుడు: విదు వినోద్‌ చోప్రా (12th ఫెయిల్‌)
  • ఉత్తమ కథ: రాకీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్‌ కహానీ
  • ఉత్తమ సంగీతం: యానిమల్‌
  • ఉత్తమ కథ (Adapted): 12th ఫెయిల్‌
  • ఉత్తమ లిరికల్స్‌: యానిమల్‌ (సిద్ధార్థ్-గరిమే, సత్రన్యాగ)
  • ఉత్తమ గాయని: శిల్పారావు (చెలియా-జవాన్‌)
  • ఉత్తమ గాయకుడు: భూపిందర్ బబ్బల్, అర్జన్ వ్యాలీ (యానిమల్‌)
Tags:    
Advertisement

Similar News