Hanuman | ఓటీటీలో దూసుకుపోతున్న హనుమాన్

Hanuman - తేజ సజ్జా హీరోగా నటించిన సినిమా హనుమాన్. థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్టయిన ఈ మూవీ, ఇప్పుడు ఓటీటీని ఓ ఊపు ఊపుతోంది.

Advertisement
Update:2024-03-19 06:57 IST

యంగ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో కె.నిరంజ‌న్ రెడ్డి నిర్మాత‌గా ఈ ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 12న విడుద‌లైన ‘హనుమాన్’ చిత్రం ఎవ‌రూ ఊహించ‌ని స‌క్సెస్‌ను సొంతం చేసుకుంది. పాన్ ఇండియా లెవ‌ల్లో 300 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది. థియేట‌ర్స్‌లో ‘హనుమాన్’ సినిమాను ఎంజాయ్ చేసిన ఆడియెన్స్ ఓటీటీలో ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆస‌క్తిగా ఎదురు చూశారు.

ఎట్టకేలకు జీ5లో స్ట్రీమింగ్ కు వచ్చింది హనుమాన్. తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన హనుమాన్ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చింది. గుంటూరుకారం, సైంధవ్, నా సామిరంగ లాంటి బడా సినిమాలు బరిలో ఉన్నప్పటికీ, తక్కువ థియేటర్లు దొరికినప్పటికీ హనుమాన్ సినిమా తన కంటెంట్ తో సూపర్ హిట్ సాధించింది. సంక్రాంతి ముగిసేనాటికి, మిగతా సినిమాలతో పోలిస్తే, హనుమాన్ కే ఎక్కువ థియేటర్లు దక్కాయి. అలా ఏకధాటిగా 7 వారాల పాటు సినిమా థియేటర్లలో సక్సెస ఫుల్ గా నిలిచింది.

ఈ క్రమంలో సంక్రాంతి బిగ్గెస్ట్ విన్నర్ గా నిలిచిన హనుమాన్, ఇప్పుడు ఓటీటీలో కూడా దుమ్ము దులుపుతోంది. రిలీజైన 11 గంటల్లోనే ఈ మూవీకి జీ5 వేదికపై 102 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూయర్ షిప్ వచ్చింది. ఈ సినిమా కోసం ఓటీటీ ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో చెప్పడానికి ఈ నంబర్ ఒక్కటి చాలు.

అయితే ఆశ్చర్యకరంగా థియేటర్లలో వచ్చినంత స్పందన ఓటీటీలో రావడం లేదు. థియేట్రికల్ రిలీజ్ టైమ్ లో అంతా ఏకపక్షంగా సూపర్ హిట్ అన్నారు. కానీ ఓటీటీ రిలీజ్ లో మాత్రం హనుమాన్ కు అలాంటి ఫీడ్ బ్యాక్ రావడం లేదు. సోషల్ మీడియాలో ఈ సినిమాపై విమర్శలు చెలరేగుతున్నాయి. చాలామంది చెప్పినంత ఘనంగా సినిమా లేదని, చివరి 20 నిమిషాలు మాత్రమే బాగుందంటూ స్పందిస్తున్నారు నెటిజన్లు.

Tags:    
Advertisement

Similar News