Calling Sahasra | సుడిగాలి సుధీర్ నుంచి మరో మూవీ

Calling Sahasra - సుడిగాలి సుధీర్ నుంచి మరో సినిమా వస్తోంది. ఈ సినిమా పేరు కాలింగ్ సహస్ర. తాజాగా విడుదల తేదీ ఫిక్స్ చేశారు.

Advertisement
Update:2023-11-20 22:14 IST

బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను అల‌రించి తిరుగులేని ఇమేజ్‌ను సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ ఇప్పుడు సిల్వ‌ర్ స్క్రీన్‌పై కూడా ఆడియెన్స్‌ని మెప్పిస్తున్నారు. సుధీర్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘కాలింగ్ సహస్ర’. షాడో మీడియా ప్రొడక్ష‌న్స్‌, రాధా ఆర్ట్స్ ప‌తాకాల‌పై అరుణ్ విక్కిరాలా ద‌ర్శ‌క‌త్వంలో విజేష్, చిరంజీవి, వెంక‌టేశ్వ‌ర్లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

సుధీర్ స‌ర‌స‌న డాలీషా హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమా విడుదల తేదీని తాజాగా ప్రకటించారు. చిత్రాన్ని డిసెంబ‌ర్ 1న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

కాలింగ్ సహస్ర ఔట్ పుట్ బాగా వ‌చ్చిందంటున్నారు మేకర్స్. సినిమాపై మంచి అంచనాలు పెరిగాయని చెబుతున్నారు. మూవీ నుంచి రీసెంట్ గా రిలీజ్ చేసిన 2 పాట‌లు, టీజ‌ర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చిందని చెబుతున్నారు.

సుడిగాలి సుధీర్‌ కు బిగ్ స్క్రీన్ పై కూడా క్రేజ్ ఉంది. అతడు నటించిన గాలోడు సినిమాకు సిల్వర్ స్క్రీన్ పై మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ సినిమా నాన్-థియేట్రికల్ బిజినెస్ కూడా భారీగా జరిగింది. దీంతో కాలింగ్ సహస్ర కు డిమాండ్ పెరిగింది. సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని భావిస్తున్నాడు సుధీర్.

Tags:    
Advertisement

Similar News