నవంబర్ నుంచి బాలయ్య కొత్త సినిమా
బాలకృష్ణ, అనీల్ రావిపూడి కాంబోలో సినిమా లాక్ అయిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు వచ్చే నెల నుంచి సెట్స్ పైకి రాబోతోంది.
ప్రస్తుతం రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు బాలయ్య. ఓవైపు అన్ స్టాపబుల్ చేస్తూనే మరోవైపు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సినిమాను కొలిక్కి తీసుకొస్తున్నాడు. ఇప్పుడు వీటికి తోడుగా మరో సినిమా కూడా సెక్స్ పైకి రాబోతోంది. నందమూరి అభిమానులు ఎప్పటినుంచో ఈగర్ గా వెయిట్ చేస్తున్న బాలకృష్ణ-అనిల్ రావిపూడి కాంబినేషన్ వచ్చే నెల నుంచి సెట్స్ పైకి రాబోతోంది. ఈ మేరకు అగ్రిమెంట్లు పూర్తయ్యాయి.
బాలకృష్ణ కోసం అనిల్ రావిపూడి డిఫరెంట్ సబ్జెక్ట్ రెడీ చేసిన సంగతి తెలిసిందే. తన స్టయిల్ నుంచి బయటకొచ్చి, అనిల్ రావిపూడి ఈ స్క్రిప్ట్ రాసుకున్నాడు. తాజాగా రావిపూడి ఇచ్చిన ఫైనల్ నెరేషన్ కు ఓకే చెప్పారు బాలయ్య. దీంతో సినిమా లాక్ అయింది.
వచ్చే నెలలో ఈ సినిమా అఫీషియల్ గా మొదలవడంతో పాటు ఆ వెంటనే రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తారు. మూవీలో బాలయ్యకు కూతురుగా హీరోయిన్ శ్రీల కనిపించనుంది.
ఈ సినిమాలో బాలయ్యకు హీరోయిన్ ఉండదు. సినిమాలో కామెడీ ఉండదు. హీరో క్యారెక్టర్ చుట్టూ తిరిగే కథ ఇది. మాస్-యాక్షన్ ఎలిమెంట్స్ మాత్రం ఉంటాయి. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించే ఛాన్స్ ఉంది.