August Box Office - ఈ నెల ఎట్రాక్షన్స్ ఇవే

August Box Office - ఆగస్ట్ లోకి వచ్చేశాం. మరి బాక్సాఫీస్ సంగతేంటి? ఈ నెలలో రాబోతున్న సినిమాలేంటి?

Advertisement
Update: 2024-08-02 01:29 GMT

ఇప్పటికే శివంభజే సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. ఈరోజు బడ్డీ, తిరగబడరా సామీ, తుఫాన్, ఉషా పరిణయం, అలనాటి రామచంద్రుడు, లారీ సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. వీటి రిజల్ట్ తెలియాలంటే మరో 24 గంటలు ఆగాల్సిందే. ఈ సినిమాలతో పాటు, ఆగస్ట్ నెలలో కొన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ వస్తున్నాయి.

9న కమిటీ కుర్రాళ్లు సినిమా ఉంది. మెగా డాటర్ నిహారిక కొణెదల నిర్మించిన తొలి ఫీచర్ ఫిలిం ఇది. ఈ సినిమాపై ఆమె చాలా హోప్స్ పెట్టుకుంది. ఇక 15వ తేదీన మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్, 35- చిన్న కథ కాదు, ఆయ్, తంగలాన్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిలో మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ పై భారీ అంచనాలున్నాయి. 35-చిన్న కథ కాదు సినిమా విడుదలపై ఇంకా సందిగ్దం ఉంది.

అటు ఆగస్ట్ 23న రావురమేష్ నటించిన మారుతీనగర్ సుబ్రమణ్యం సినిమా విడుదలకు సిద్ధమైంది. ట్రయిలర్ తో ఇది ఇప్పటికే ఆకట్టుకుంటోంది. ఆ టైమ్ కు రావురమేష్ కు పోటీగా మరో 2 సినిమాలు కూడా రావొచ్చు.

ఇక ఆగస్ట్ కు ఫినిషింగ్ టచ్ ఇస్తూ.. 29వ తేదీన సరిపోదా శనివారం మూవీ వస్తోంది. నాని హీరోగా నటించిన ఈ సినిమాపై కూడా భారీ అంచనాలున్నాయి. వివేక్ ఆత్రేయ డైరక్ట్ చేసిన ఈ సినిమాలో నాని సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించింది. అలా ఆగస్ట్ నెలలో మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్, సరిపోదా శనివారం సినిమాలు అందర్నీ ఆకర్షిస్తున్నాయి.

Tags:    
Advertisement

Similar News