Arjun Rampal - బాలయ్య సినిమాలో అర్జున్ రాంపాల్

Arjun Rampal - టాలీవుడ్ కు మరో నటుడు దిగుమతి అయ్యాడు. మొన్నటికిమొన్న ఏజెంట్ సినిమాతో డినో మోరియా వచ్చాడు. ఇప్పుడు బాలయ్య మూవీతో అర్జున్ రాంపాల్ వస్తున్నాడు.;

Advertisement
Update:2023-05-10 12:50 IST
Arjun Rampal - బాలయ్య సినిమాలో అర్జున్ రాంపాల్
  • whatsapp icon

నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ అనిల్ రావిపూడి ల మోస్ట్ అవైటెడ్ మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రస్తుతం షూటింగ్ స్టేజ్ లో ఉంది.ఈ భారీ ప్రాజెక్ట్‌ను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు.

కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల కీలక పాత్రలో కనిపించనుంది. ఇప్పుడు ఓ పవర్ ఫుల్ పాత్ర కోసం బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ తెరపైకి వచ్చాడు. అనౌన్స్‌మెంట్ వీడియోలో అర్జున్ రాంపాల్, బాలకృష్ణ లెజెండ్ చిత్రంలోని ''ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు అనే పాపులర్ డైలాగ్ చెప్పారు. ఇందులో అర్జున్ రాంపాల్, అనిల్ రావిపూడి మధ్య సంభాషణ కూడా ఉంది.

అర్జున్ రాంపాల్ ఈ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెడుతున్నాడు. హైదరాబాద్‌లో జరుగుతున్న షెడ్యూల్‌లో సినిమా షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు. బాలకృష్ణ, అర్జున్ రాంపాల్ లని కలిసి తెరపై చూడటం ఆసక్తికరంగా ఉండబోతుంది.

ఉగాది సందర్భంగా బాలకృష్ణ ను రెండు డిఫరెంట్ లుక్స్ లో ప్రజంట్ చేస్తూ మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇక ఈ సినిమాలో శ్రీలల కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇంకా పేరుపెట్టని ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేయబోతున్నారు. 


Full View


Tags:    
Advertisement

Similar News