నిర్మాతను భయపెట్టిన తర్వాతే సినిమా తీస్తా!

ఓ సినిమా తీసేముందు నిర్మాతను భయపెడతానంటున్నాడు అనుదీప్. ఈ కామెడీ చిత్రాల దర్శకుడు ఎందుకలా అన్నాడు.. దీని వెనక లాజిక్ ఏంటి..

Advertisement
Update:2022-08-28 15:05 IST

ఓ కొత్త దర్శకుడికి నిర్మాత దొరకడమే ఎక్కువ. డబ్బులు పెడతానంటూ ఎవరైనా ముందుకొస్తే ఎగిరి గంతేస్తారు. కానీ దర్శకుడు అనుదీప్ కేవీ మాత్రం రివర్స్. తన దగ్గరకు ఏ నిర్మాత వచ్చినా ముందుగా అతడ్ని భయపెడతానని, డబ్బులన్నీ పోతాయని వార్నింగ్ ఇస్తానని చెబుతున్నాడు.

"నా దగ్గరకొచ్చే నిర్మాతని ముందుగా డబ్బులున్నాయా అని అడుగుతాను. ఆ తర్వాత నా సినిమా బడ్జెట్ చెబుతాను. పెట్టిన డబ్బులన్నీ పోతాయి ఓకేనా అని అడుగుతాను. అలా మెంటల్లీ ప్రిపేర్ చేసిన తర్వాతే సినిమాకు అగ్రిమెంట్ సైన్ చేస్తాను. ఫస్ట్ డే ఫస్ట్ షో కూడా అలానే చేశాను."

ఇప్పటికే చాలామంది నిర్మాతలుగా అలా చెప్పానని అన్నాడు అనుదీప్. అన్నీ తానై (దర్శకత్వం మాత్రం చేయలేదు) ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా తీసిన అనుదీప్.. చెప్పిన బడ్జెట్ లోనే ఆ సినిమాను పూర్తిచేశామని అన్నాడు. అయితే శివకార్తికేయన్ తో చేస్తున్న సినిమాకు మాత్రం బడ్జెట్ చేయిదాటిందని చెప్పుకొచ్చాడు.

శివకార్తికేయన్ తో చేస్తున్న సినిమాకు ఆఖరి నిమిషంలో ఓ సాంగ్ పెట్టారట. ఆ పాట కోసం భారీ సెట్ కూడా వేశారంట. అలా ఖర్చు పెరిగిపోయిందంటున్నాడు అనుదీప్.

Tags:    
Advertisement

Similar News