హర్ష సాయిపై మరో కేసు..ఎందుకో తెలుసా?

యూట్యూబర్ హర్షసాయి అతడి పౌండేషన్‌పై రాచకొండ సైబర్ పోలీస్ స్టేషన్‌‌లో మరో కేసు నమోదైంది. సహాయం పేరుతో రూ.5.4 లక్షలు వసూలు చేసి మోసం చేశారని బాధితుడు ఫిర్యాదు చేశాడు

Advertisement
Update:2024-09-30 15:34 IST

యూట్యూబర్ హర్ష సాయి అతడి పౌండేషన్‌పై రాచకొండ సైబర్ పోలీస్ స్టేషన్‌‌లో మరో కేసు నమోదైంది. సహాయం పేరుతో రూ.5.4 లక్షలు వసూలు చేసి మోసం చేశారని బాధితుడు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు 406, 419, 420, ఐపీసీ, 66-సీ 66-డీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. యువతి అత్యాచార కేసు పెట్టిన విషయం తెలిసిందే. లైంగికంగా వేధించడంతో పాటు బెదిరిస్తున్నదంటూ ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. హర్ష సాయి పై రేప్‌ కేసు నమోదై వారం రోజులు అవుతుంది. హర్షసాయి కోసం గాలిస్తోన్నామని నార్సింగి పోలీసులు చెబుతున్నారు. అయితే హర్షసాయి మాత్రం బాధితురాలికి సంబంధించి రోజుకో ఆడియో సోషల్ మీడియాలో విడుదల చేస్తున్నాది. దీంతో నిందితుడిని త్వరగా అరెస్ట్ చేయాలని బాధితురాలు కోరుతుంది.

అటు ఏపీలో కూడా బాధితులు క్యూ కడుతున్నారు. అతడు ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్ వల్ల ఇళ్లు, ఒళ్లు గుళ్ల చేసుకున్నామని, ఆర్థికంగా నష్టపోయామని, అప్పుల పాలయ్యామంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నారు. హర్షసాయి మాత్రమే కాదు.. సగం నేరాన్ని పంచుకున్న అతడి తండ్రి కూడా పరారీలోనే ఉన్నాడు. ఫ్యామిలీ మొత్తం అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తుంది. అయితే.. హర్షసాయి తనపై వస్తున్న ఆరోపణలు కొట్టివేస్తున్నాడు. డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నారని ట్వీట్ చేసి.. అడ్వకేట్‌ను రంగంలోకి దింపాడు. హర్ష సాయి విదేశాలకు పారిపోయినట్లు తెలుస్తోంది. పోలీసులు అతనికి లుకౌట్ నోటీసులు జారీ చేయునట్లు తెలుస్తోంది

Tags:    
Advertisement

Similar News