జానీ మాస్టర్‌కు మరో బిగ్ షాక్

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ బెయిల్ పిటిషన్‌ను రంగారెడ్డి జిల్లా కోర్టు కొట్టివేసింది.

Advertisement
Update:2024-10-14 18:13 IST

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు రంగారెడ్డి జిల్లా కోర్డు షాకిచ్చింది. అత్యాచార కేసులో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను జిల్లా కోర్టు కొట్టివేసింది. ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్న జానీ మాస్టర్. జాతీయఅవార్డు తీసుకోవడానికి 4 రోజులు మధ్యంతర బెయిల్‌ను కోర్టు మంజూరు చేసింది. ఈ నెల 10న కోర్టులో హాజరుకావాలని జానీని రంగారెడ్డి కోర్టు ఆదేశించింది. తిరుచిత్రాబళం సినిమాలో మేఘం కరుగత పాటకు గాను.. బెస్ట్ కొరియోగ్రాఫర్‌గా నేషనల్ అవార్డుకు జానీ ఎంపికయ్యారు.

2022కు గాను 70వ జాతీయ అవార్డుల్లో జానీకి పురస్కారాన్ని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే.. తన వద్ద పని చేసిన కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలతో జానీ మాస్టర్ గత నెలలో జైలు పాలయ్యారు. పోక్సో కేసు కూడా నమోదైంది. ఈ తరుణంలో ఆయన నేషనల్ అవార్డు రద్దయింది. జానీ మాస్టర్‌కు జాతీయ అవార్డును నిలిపివేయడంపై పలువురు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండించారు.

Tags:    
Advertisement

Similar News

'అఖండ 2' షురూ