ఫిలింఫేర్ అవార్డుల నామినేషన్స్ లో ‘యానిమల్’ హవా!

హిందీ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత పురాతన సినిమా అవార్డులలో ఒకటైన ‘ఫిలింఫేర్ అవార్డ్స్’ జనవరి 27, 28 తేదీల్లో 69వ ఎడిషన్‌తో తిరిగి రావడానికి సంసిద్ధమవుతోంది.

Advertisement
Update:2024-01-17 12:47 IST

హిందీ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత పురాతన సినిమా అవార్డులలో ఒకటైన ‘ఫిలింఫేర్ అవార్డ్స్’ జనవరి 27, 28 తేదీల్లో 69వ ఎడిషన్‌తో తిరిగి రావడానికి సంసిద్ధమవుతోంది. ఈ కొత్త ఎడిషన్ ని గుజరాత్‌లోని గాంధీనగర్‌లో నిర్వహిస్తారు. ముంబాయిలో నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో నామినేషన్లు ప్రకటించారు. నామినేషన్స్ లో అందర్నీ ఆశ్చర్యపరుస్తున్న అంశమేమిటంటే, రణబీర్ కపూర్ నటించిన సెన్సేషనల్ హిట్ ‘యానిమల్’ కి ఏకంగా 19 నామినేషన్లు రావడం! దిమ్మదిరిగే 19 నామినేషన్లు బాలీవుడ్ ‘యానిమల్’ ని ఎంత సీరియస్ గా తీసుకుంటోందో స్పష్టం చేస్తోంది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ మీద ఎగరేసిన తిరుగులేని విజయ పతాకకి ఇది నిదర్శనం. కాగా, సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ఈ సంవత్సరం విడుదలైన ‘పఠాన్’, ‘జవాన్’, ‘డంకీ’ మూడిట్లో- ‘జవాన్’, ‘డంకీ’ లలో నటనకు గాను రెండు ఉత్తమ నటుడి నామినేషన్లు పొందాడు.

ఇక తక్కువ బడ్జెట్లో తీసి విజయం సాధించిన ‘12th ఫెయిల్' కూడా ఫిలిం ఫేర్ అవార్డ్స్ 2024 కి ప్రధాన కేటగిరీల్లో అనేక నామినేషన్లు పొందింది. ఈ అవార్డుల ఫంక్షన్ కి నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ 3 సంవత్సరాల తర్వాత హోస్ట్ గా తిరిగి రాబోతున్నాడు. రెండు రోజుల పాటు జరిగే ఈ అవార్డుల ప్రదానోత్సవంలో నటులు రణబీర్ కపూర్, కరీనా కపూర్ ఖాన్, కార్తీక్ ఆర్యన్, సారా అలీ ఖాన్, ధావన్, జాన్వీ కపూర్‌ల కనువిందు చేసే ప్రదర్శనలు వుంటాయి.

నామినేషన్ల జాబితా:

ఉత్తమ సినిమా: 12th ఫెయిల్, యానిమల్, పఠాన్, జవాన్, ఓఎంజీ 2, రాకీ ఔర్ రాణీకీ ప్రేమ్ కహానీ

ఉత్తమ దర్శకుడు: సందీప్ రెడ్డి వంగా (యానిమల్), అట్లీ (జవాన్), సిద్ధార్థ్ ఆనంద్ (పఠాన్), విధు వినోద్ చోప్రా (12th ఫెయిల్), అమిత్ రాయ్ (ఓఎంజీ2), కరణ్ జోహార్ (రాకీ ఔర్ రాణీకీ ప్రేమ్ కహానీ),

ఉత్తమ నటుడు: షారూఖ్ ఖాన్ (డంకీ), షారుఖ్ ఖాన్ (జవాన్), రణబీర్ కపూర్ (యానిమల్), రణవీర్ సింగ్ (రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ), సన్నీ డియోల్ (గదర్ 2) విక్కీ కౌశల్ (సామ్ బహదూర్)

ఉత్తమ నటి: దీపికా పదుకొనే (పఠాన్), తాప్సీ పన్ను (డంకీ), అలియా భట్ (రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ), భూమీ పెడ్నేకర్ (వచ్చినందుకు ధన్యవాదాలు), కియారా అద్వానీ (సత్యప్రేమ్ కీ కథ), రాణి ముఖర్జీ (మిసెస్ ఛటర్జీ Vs నార్వే)

ఉత్తమ సహాయ నటుడు: అనిల్ కపూర్ (యానిమల్), బాబీ డియోల్ (యానిమల్), ఇమ్రాన్ హష్మీ (టైగర్ 3), విక్కీ కౌశల్ (డంకీ), ఆదిత్యా రావల్ (ఫరాజ్), రాయ్ చౌదరి (రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ)

ఉత్తమ సహాయ నటి: జయా బచ్చన్ (రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ), షబానా అజ్మీ (ఘూమర్), షబానా అజ్మీ (రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ), రత్నా పాఠక్ షా (ధక్ ధక్), తృప్తీ డిమ్రి (యానిమల్), యామీ గౌతమ్ (ఓఎంజీ 2)

ఉత్తమ సంగీతం: యానిమల్ (ప్రీతమ్, విశాల్ మిశ్రా, మనన్ భరద్వాజ్, శ్రేయాస్ పురాణిక్, జానీ, భూపీందర్ బబ్బల్, అషిమ్ కెమ్సన్, హర్షవర్ధన్ రామేశ్వర్, గురీందర్ సీగల్), డంకీ (ప్రీతమ్), జవాన్ (అనిరుధ్ రవిచందర్), పఠాన్ (విశాల్ - శేఖర్), రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ (ప్రీతమ్), తూ ఝూఠీ మై మక్కార్ (ప్రీతమ్), జరా హాట్కే జరా బచ్కే (సచిన్-జిగర్)

ఉత్తమ గాయకుడు: అరిజిత్ సింగ్ (లట్ పుట్ గయా- డంకి), అరిజిత్ సింగ్ (సత్రాంగ- యానిమల్), భూపిందర్ బబ్బల్ (అర్జన్ వైలీ-యానిమల్), షాహిద్ మాల్యా (కుడ్మయీ- రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ), సోనూ నిగమ్ (నిక్లే ది కభీ హమ్ ఘర్ సే- డంకీ), వరుణ్ జైన్, సచిన్- జిగర్, షాదాబ్ ఫరీదీ, అల్తమాష్ ఫరీదీ (తేరే వాస్తే ఫలక్- జరా హట్కే జరా బచ్కే)

ఉత్తమ గాయని: దీప్తీ సురేష్ (ఆరారారీ రారో- జవాన్), జోనితా గాంధీ (హే ఫికర్- 8 ఏఎం మెట్రో), శిల్పా రావు (బేషరం రంగ్- పఠాన్), శిల్పా రావు (చలే ఆ - జవాన్)< శ్రేయా ఘోషల్ (తుమ్ క్యా మైల్- రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ), శ్రేయా ఘోషల్ (వే కమ్లేయా- రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ)

ఉత్తమ కథా రచయిత: అట్లీ (జవాన్), సిద్ధార్థ్ ఆనంద్ (పఠాన్), అమిత్ రాయ్ (ఓఎంజీ2), అనుభవ్ సిన్హా (భీడ్) దేవాశిష్ మఖిజా (జోరం), ఇషితా మోయిత్రా, శశాంక్ ఖైతాన్, సుమిత్ రాయ్ (రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ), కరణ్ శ్రీకాంత్ శర్మ (సత్యప్రేమ్ కీ కథ), పారిజాత్ జోషి - తరుణ్ దుదేజా (ధక్ ధక్)

ఉత్తమ ఛాయాగ్రహకుడు: అమిత్ రాయ్ ( యానిమల్ ), జికె విష్ణు ( జవాన్ ), రంగరాజన్ రామబద్రన్ ( 12th ఫెయిల్), సచ్చిత్ పౌలోస్ ( పఠాన్ ), మనుష్ నందన్ (రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ), ప్రథమ్ మెహతా ( ఫరాజ్ )

ఉత్తమ వస్త్రాలంకరణ: మాళవికా బజాజ్ (12th ఫెయిల్), షాలీనా నథాని, కవిత జె, అనిరుధ్ సింగ్, దీపికా లాల్ ( జవాన్ ), షాలీనా నథాని, మమతా ఆనంద్, నిహారిక జాలీ ( పఠాన్ ), శీతల్ శర్మ ( యానిమల్ )మనీష్ మల్హోత్రా, ఎకా లఖానీ (రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ ), సచిన్ లవ్లేకర్, దివ్వ్యా గంభీర్, నిధి గంభీర్ (సామ్ బహదూర్),

ఉత్తమ నృత్య దర్శకుడు: బోస్కో-సీజర్, ('ఝూమ్ జో పఠాన్' - పఠాన్), శోబీ పాల్‌రాజ్, ('జిందా బందా' - జవాన్), గణేష్ ఆచార్య, ('లుట్ పుట్ గయా'- డంకి), గణేష్ ఆచార్య, ('తేరే వాస్తే ఫలక్' - జరా హాట్కే జరా బచ్కే), గణేష్ ఆచార్య, ('ఏం ఝుమ్కా?' - రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ), వైభవీ వ్యాపారి, ( ‘దింఢోరా బజే' - రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ)

ఉత్తమ ఎడిటింగ్: సందీప్ రెడ్డి వంగా (యానిమల్) , ఆరిఫ్ షేక్ ( పఠాన్), రూబెన్ (జవాన్), అతాను ముఖర్జీ (అఫ్వా), సువీర్ నాథ్ (ఓఎంజీ2), జస్కున్వర్ కోహిల్- విధు వినోద్ చోప్రా (12th ఫెయిల్). 

Tags:    
Advertisement

Similar News