Kantara OTT Release Date: నేటి అర్ధ‌రాత్రి నుంచి ఓటిటిలో కాంతారా స్ట్రీమింగ్‌ - అధికారికంగా ప్ర‌క‌టించిన అమెజాన్ ప్రైమ్‌

Kantara Movie to stream on Amazon Prime: ఇక్క‌డ చిన్న ట్విస్ట్ ఏమిటంటే, ఈ సినిమా ఓటిటి భాష‌ల్లో హిందీని అనౌన్స్ చేయ‌లేదు. తెలుగు, త‌మిళం, మ‌ళ‌యాళం భాష‌ల్లో స్ట్రీమింగ్ అవుతుంద‌ని మాత్రం పేర్కొన్నారు.

Advertisement
Update:2022-11-23 19:45 IST

రిషబ్‌ శెట్టి హీరోగా న‌టించి.. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన‌ కాంతార సినిమా ఓటిటి రిలీజ్ డేట్‌పై క్లారిటీ వ‌చ్చింది. హోంబలే ఫిలిం సంస్థ నిర్మించిన కన్నడ చిత్రం కాంతార ప‌లు భాషాల్లోకి అనువ‌దించ‌బ‌డింది. 2022 బాక్సాపీస్ బంప‌ర్‌ హిట్‌ మువీగా రికార్డు సృష్టించింది. సప్తమి గౌడ, హీరో రిషబ్‌ శెట్టి జంటగా నటించిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి ఇప్పటి వరకు దాదాపు రూ.400 కోట్లు వసూలు చేసింది.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటిటిలో విడుద‌ల‌వుతుంద‌న్న ఆస‌క్తి ప్రేక్ష‌కుల్లో నెల‌కొంది. నవంబర్ 18న ఉండవచ్చని భావించారు, కానీ ఆ రోజుకు ఇంకా థియేట‌ర్ల‌లో క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురుస్తుండ‌టంతో వాయిదా వేశారు. ఈ రోజు అర్ధ‌రాత్రి 12 గంట‌ల నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అన్ని భాష‌ల్లో స్ట్రీమింగ్‌లోకి వ‌స్తున్న‌ట్లు అమెజాన్ ప్రైమ్ వీడియోస్ అధికారికంగా ట్వీట్ చేసింది. ఇక్క‌డ చిన్న ట్విస్ట్ ఏమిటంటే, ఈ సినిమా ఓటిటి భాష‌ల్లో హిందీని అనౌన్స్ చేయ‌లేదు. తెలుగు, త‌మిళం, మ‌ళ‌యాళం భాష‌ల్లో స్ట్రీమింగ్ అవుతుంద‌ని మాత్రం పేర్కొన్నారు. గ‌తంలో కేజీఎఫ్ సినిమాను నిర్మించిన సంస్థే కాంతారాను కూడా నిర్మించింది.

గీతా ఫిల్మ్‌ డిస్టిబ్యూషన్‌ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో అక్టోబర్‌ 15న కాంతార ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఏకంగా 9 తెలుగు సినిమాలు కాంతార దాటికి నెగ్గలేకపోయాయి. స‌హ‌జంగా సినిమా విడుద‌లైన ఆరు వారాల‌కు ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుంది. కాంతారా విడుద‌లై నేటికి సరిగ్గా 38 రోజులు అయింది. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల నుంచే 48 కోట్ల గ్రాస్ 25 కోట్ల షేర్ దాటేసింద‌ని చెబుతున్నారు. ఓవర్సీస్‌లో కేజీఎఫ్ తర్వాత రెండు మిలియన్ మార్క్ అందుకున్న రెండో శాండల్ వుడ్ మూవీగా కాంతార రికార్డు నెలకొల్పింది. బాలీవుడ్‌ కొత్త సినిమాలు మిలీ, ఫోన్ భూత్‌లు సైతం కాంతార దెబ్బకు చ‌తికిల‌బ‌డ్డాయి. మిగ‌తా భాష‌ల కంటే కన్నడలో కాంతార 15 రోజులు ముందుగా విడుద‌లైంది.

Also Read: ఈ వారం థియేటర్‌, ఓటీటీలో విడుదలవుతున్న తెలుగు మూవీస్ ఇవే

Tags:    
Advertisement

Similar News