Kalki Movie | అదనపు ధరలకు ఓకే

Kalki Movie Ticket rates - కల్కి మూవీ విడుదలకు కౌంట్ డౌన్ మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా టికెట్ రేట్లు పెరగబోతున్నాయి.

Advertisement
Update: 2024-06-23 02:05 GMT

కల్కి సినిమా థియేట్రికల్ రిలీజ్ కు మొత్తం సెట్ అయింది. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి జీవోలు రావడమే ఆలస్యం. అన్నీ అనుకున్నట్టు జరిగితే సోమవారం ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి జీవోలు వచ్చే అవకాశం ఉంది. ఆ వెంటనే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవుతాయి.

తాజా సమాచారం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ లో కల్కి సినిమా కోసం టికెట్ పై 100 రూపాయల పెంపునకు అనుమతి ఇచ్చినట్టు తెలుస్తోంది. మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్స్ అనే తేడా లేకుండా యూనిఫాం గా వంద పెంచే వెసులుబాటు ఇచ్చినట్టున్నారు. అదనపు షోలు, మిడ్ నైట్ షోలకు సంబంధించి జీవో వచ్చిన తర్వాత క్లారిటీ వస్తుంది.

ఇక తెలంగాణలో మల్టీప్లెక్సుల్లో టికెట్ పై 75 రూపాయలు, సింగిల్ స్క్రీన్స్ లో వంద రూపాయలు పెంచుకునేందుకు అనుమతి లభించినట్టు తెలుస్తోంది. దీంతో పాటు ఉదయం 5గంటల ఆటకు కూడా ప్రత్యేక అనుమతి దొరికింది. హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు ముఖ్యమైన పట్టణాల్లో ఉదయం 5 గంటల ఆట ఉండే ఛాన్స్ ఉంది.

ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాను 600 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించాడు నిర్మాత అశ్వనీదత్. దీపిక పదుకోన్, దిశా పటానీ హీరోయిన్లుగా నటించగా.. అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషించారు. ఇక కమల్ హాసన్ విలన్ గా నటించారు.

Tags:    
Advertisement

Similar News