Adipurush New Poster: ప్రభాస్ బర్త్ డే స్పెషల్.. ఆదిపురుష్ కొత్త పోస్టర్

Adipurush New Poster: ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆదిపురుష్ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. రఘురాముడిగా ప్రభాస్ లుక్ చాలా బాగుంది.

Advertisement
Update: 2022-10-23 16:22 GMT

Adipurush New Poster: ఆదిపురుష్ కొత్త పోస్టర్

Adipurush New Poster: దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న 'ఆదిపురుష్' చిత్రం నుంచి రాముడి గెటప్ లో ఉన్న ప్రభాస్ పోస్టర్ ను యూనిట్ విడుదల చేసింది. ఈరోజు ప్రభాస్ పుట్టినరోజు. అందుకే ఈ పోస్టర్.

వచ్చే ఏడాది జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులముందుకు రానున్న ఈ చిత్రం 3డీ లో కూడా విడుదల కానుంది. అయోధ్యలోని సరయు నది ఒడ్డున చిత్ర యూనిట్ ఈ సినిమా టీజర్ ను. ఫస్ట్ లుక్ పోస్టర్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ చిత్రంలో సీత పాత్రలో నటిస్తున్న కృతి సనన్ కూడా తన సోషల్ మీడియా టైమ్ లైన్ లో ఈ పోస్టర్ ను షేర్ చేసింది. ప్రభాస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.

ప్రభాస్, కృతి సనన్‌ తో పాటు, ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్. సన్నీ సింగ్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. సైఫ్ రావణాసురుడిగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా కనిపించబోతున్నారు. టి-సిరీస్, రెట్రోఫిల్స్ బ్యానర్లపై ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా వస్తోంది ఆదిపురుష్.




Tags:    
Advertisement

Similar News