కరోనాతో సినిమాలపై ఆసక్తి పెరిగిందంట

రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నాడు వేణు తొట్టెంపూడి. మళ్లీ నటనపై ఆసక్తి పెరగడానికి కరోనా కారణం అంటున్నాడు

Advertisement
Update:2022-07-28 20:03 IST

కరోనా చాలా మందిని ఇబ్బంది పెట్టింది. అయితే వేణు తొట్టెంపూడికి మాత్రం సినిమాలపై ఆసక్తి పెంచింది. కరోనా టైమ్ లో ఒక్కసారిగా ఫ్రీ అయిపోవడంతో నటన వైపు మళ్లీ మనసు మళ్లిందని చెప్పుకొచ్చాడు ఈ మాజీ హీరో. అలా రామారావు ఆన్ డ్యూటీతో రీఎంట్రీ ఇస్తున్నాడు.

"దమ్ము సినిమా తర్వాత మళ్లీ సినిమాల్లో కనిపించకపోవడానికి ప్రత్యేకమైన కారణాలు ఏమీ లేవు. మాకు ఫ్యామిలీ బిజినెస్స్ చాలా ఉన్నాయి. బిజినెస్ లో బిజీ అయిపోయా. సినిమాల గురించి అలోచించే తీరికే లేకుండాపోయింది. కొంతమంది సినిమా కోసం సంప్రదించినా సున్నితంగా వద్దనే వాడిని. అయితే కరోనాకి థాంక్స్ చెప్పుకోవాలి. కరోనా సమయంలో ఇంట్లో కూర్చుని రకరకాల సినిమాలు, వెబ్ సీరిసులు చూడ్డం మొదలుపెట్టాను. అప్పుడు మళ్ళీ సినిమాపై ఆసక్తి మళ్ళింది. మంచి పాత్రలు చేయాలనిపించింది. ఇలాంటి సమయంలో దర్శకుడు శరత్ మండవ రామారావు ఆన్ డ్యూటీ కథ చెప్పారు. కథ అద్భుతంగా ఉంది. సిఐ మురళిగా నా పాత్ర గురించి చెప్పారు. చాలా బావుంది. ఇలాంటి పాత్ర నేను ఎప్పుడూ చేయలేదు. ఇలాంటి జోనర్ కూడా ఫస్ట్ టైమ్. రవితేజ గారి లాంటి మాస్ స్టార్ సినిమాతో మళ్ళీ నేను రీఎంట్రీ ఇవ్వడం ఆనందంగా ఉంది."

ఇలా కరోనా కారణంగా తిరిగి సినిమాల్లోకి రావాల్సి వచ్చిందనే విషయాన్ని బయటపెట్టాడు వేణు. అతడు రీఎంట్రీ ఇచ్చిన రామారావు ఆన్ డ్యూటీ సినిమా రేపు థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమా క్లిక్ అయితే వేణుకు మరిన్ని అవకాశాలు వరిస్తాయి. 

Tags:    
Advertisement

Similar News